ప్రభుత్వం మారింది… కాటన్ కు పాత రోజులు వచ్చేనా

– కష్టకాలంలో కాటన్ వస్త్రోత్పత్తి
– మూతపడ్డ సైజింగ్ లు డయింగ్ లు
– 20వేల నుంచి రెండు వేలకు తగ్గిన మరమగ్గాలు
నవతెలంగాణ- సిరిసిల్ల
నాడు సిరిసిల్ల కాటన్ వస్త్రోత్పత్తికే పెట్టింది పేరు.. నేడు ఆ కాటన్ వస్త్రోత్పత్తి కష్ట కాలాన్ని ఎదుర్కొంటుంది 20వేల మరమగ్గాలపై కాటన్ ఆ రోజుల్లో నడిచేది ప్రస్తుతం 2000 మరమగ్గాలపై కూడా నడవడం లేదు కాటన్ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది గత ప్రభుత్వంలో అనేకసార్లు కాటన్ వస్త్ర వ్యాపారులు తమ గోడును వెళ్లబోసుకున్నారు కానీ ఎలాంటి లాభం కనిపించలేదు దీంతో పరిశ్రమ చతికిలబడిపోయింది ప్రస్తుత ప్రభుత్వం కాటన్ పరిశ్రమపై దృష్టి సారిస్తే సిరిసిల్ల లో కాటన్ పరిశ్రమకు మళ్లీ మంచి రోజులు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాటన్ కు అనుబంధం గా ఉన్న డయింగ్ సైజింగ్ లు మూతపడ్డాయి సుమారు 300 డయింగ్ లు ఉండగా అవి పదికి చేరుకున్నాయి సిరిసిల్లలో ఉన్న 25 సైజింగ్లు మూతపడ్డాయి ప్రస్తుతం ఐదు సైజింగ్ లు మాత్రమే నడుస్తున్నాయి ఈ పరిశ్రమకు అనుబంధంగా పనిచేసే ఐదు వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు గత ప్రభుత్వం పాలిస్టర్ కు ఇచ్చిన ప్రాధాన్యం కాటన్ రంగానికి ఇవ్వకపోవడంతో కార్మికులు రోడ్డున పడగా యజమానులు నష్టాల్లో కూలిపోయారు
 అప్పుల పాలైన ఉత్పత్తిదారులు
సిరిసిల్లలో గతంలో 36వేల మర మగ్గాలు ఉండగా  పాలిస్టర్ 10 శాతం మరమగ్గాలపై నడిచేవి మిగతా 90 శాతం మరమగ్గాల్లో కాటన్ నడిచేది ప్రస్తుతం 10 శాతం మరమగ్గాల పైన మాత్రమే కాటన్ వస్త్రాలు తయారవుతున్నాయి దీంతో కాటన్ మరమగ్గాలకు ముడిసరుకులైన బీములను సైజింగ్ పరిశ్రమలు అందిస్తుండగా కాటన్ గుడ్డను మరమగ్గాలపై ఉత్పత్తి చేసిన అనంతరం డయింగ్ పరిశ్రమలు ఈ వస్త్రాలను అద్దకం చేస్తాయి ప్రస్తుతం కాటన్ వస్త్ర ఉత్పత్తి రంగం కుదేలు కావడంతో వాటిపై ఆధారపడి మనుగడ సాధించే డయంగు పరిశ్రమలు అద్దకం పరిశ్రమల్లో కార్మికులు ఉపాధి కోల్పోయారు ఈ రెండు రంగాల పరిశ్రమల్లో పనిచేసే కార్మికులతో పాటు యజమానుల పరిస్థితి కూడా దయానియంగా మారింది
తప్పని నష్టాలు… కష్టాలు
బతుకమ్మ చీరల ఉత్పత్తితో మరమగ్గాలపై పాలిస్టర్ తయారీ జరుగుతుండడంతో కార్మికులు సైతం కాటన్ తయారీ చేయడం లేదు ఇప్పటికే సైజింగ్ లు డయింగ్ లు మూతపడుతూ వస్తున్నాయి కొన్ని డయంగులు సైజింగ్ లు కష్టంగా నష్టాల్లో నడుస్తున్నాయి బతుకమ్మ చీరలు ఇతర ప్రభుత్వ ఆర్డర్లతో కార్మికులను యజమానులను ఆదుకున్న గత ప్రభుత్వం కాటన్ వస్త్ర రంగాన్ని ఆదుకోకపోవడంతో తాజాగా పరిశ్రమలు మూతకు దారితీసాయి  ప్రభుత్వం ఇప్పటికైనా కాటన్ వస్త్రోత్పత్తిని ఆదుకుంటే బాగుంటుంది సిరిసిల్ల కాటన్ వస్త్ర పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో ఉంది ఏర్పాటు చేసిన పరిశ్రమలు మూతపడ్డాయి కాటన్ వస్త్ర ఉత్పత్తి పరిశ్రమలు ఆదుకోవాలని గత ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు అయినా లాభం లేకుండా పోయింది ప్రస్తుత ప్రభుత్వమైన కాటన్ పరిశ్రమపై దృష్టి సారించి సంక్షోభంలో ఉన్న పరిశ్రమను గట్టెక్కించాల్సిన అవసరం ఉంది పాలిస్టర్ లాగే కాటన్ కు కూడా ప్రభుత్వం ఆర్డర్లు ఇప్పిస్తే ఉపాధి కల్పించిన వారు అవుతారు
 నెలకు ఐదు రోజులే నడుస్తుంది
– గాలి పెళ్లి శ్రీనివాస్ సైజింగ్ కార్మికుడు
గతంలో నెలలో 30 రోజులు పని ఉండేది ప్రస్తుత పరిస్థితుల్లో నెలలో ఐదు రోజులు మాత్రమే పని ఉంటుంది నెలకు 5000 మాత్రం వస్తున్నాయి సిరిసిల్లలో సైజింగ్లు అన్ని మూతబడి ప్రస్తుతం 5 మాత్రం నడుస్తున్నాయి గతంలో 100 అద్దకం పరిశ్రమలు ఉండేవి ఇప్పుడు ఆరు అద్దకం పరిశ్రమలు మాత్రం నడుస్తున్నాయి ఈ ప్రభుత్వం ఏమైనా ఆలోచించి కాటన్ పరిశ్రమను గట్టెక్కిస్తేనే కార్మికులు బతుకుతారు.