– క్రియేటివ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి రామకష్ణ
– 8వ రోజుకు చేరిన జీపీ కార్మికుల సమ్మె కార్యాలయం ముందు వంట వార్పులో పాల్గొన్న జీపీ కార్మికులు
నవతెలంగాణ-పూడూర్
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి రామకష్ణ అన్నారు. గురువారం పూడూరు మండల కేంద్రంలో జిపి కార్మికులు చేపట్టిన సమ్మె 8వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కార్మికులు మండల కార్యాలయం ముందు వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. నేడు గ్రామాలు బాగున్నాయి అంటే పంచాయతీల్లో చేస్తున్న కార్మికుల శ్రమ వల్లే గ్రామాలు అభివద్ధిలో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో కార్మికులు సంపత్, బందయ్య, ఆంజనేయులు, రాజు, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు