– దామెర కిరణ్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి
నవతెలంగాణ – గోవిందరావుపేట
గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలికి వదిలేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను తీవ్ర సంక్షోభంలో కి నెట్టిందని ఎస్ ఎఫ్ ఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామెర కిరణ్ అన్నారు. శనివారం మండలంలోని పసర గ్రామంలో కాకతీయ డిగ్రీ కళాశాలలో ఎస్ఎఫ్ఐ రెండవ జిల్లా మహోత్సవ మహాసభను దామర కిరణ్ ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడింది, గత ప్రభుత్వం విద్యారంగాన్ని గాలికొదిలేసింది, గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యా రంగం తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడింది . 7200 కోట్ల పైచిలుకు పెండింగ్స్ స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, గత తొమ్మిది నెలలకాలంగా ఎస్సీ, ఎస్టీ,బీసీ సంక్షేమ శాఖల్లో డైట్ బిల్లులు లేవు. సంక్షేమ హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడంలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి .అనేక విద్యా కేంద్రాల్లో ఫుడ్ పాయిజన్లు, మౌలిక వసతుల కొలత కారణంగా గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు సంభవిస్తున్నాయి. మెస్ కాస్మోటిక్ చార్జీల పెంపు ప్రతిపాదనలు పేపర్ ప్రకటనలకే పరిమితం అయ్యాయి, గత ప్రభుత్వ హామీ అమలు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసినందుకు 11,000 పైచిలుకు ఉద్యోగాలకు మెగా డీఎస్సీ తీసింది, దీనికి ఎటువంటి న్యాయపరమైన ఆటంకాలు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కేజీబీవీలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న సంక్షేమ వసతి గృహాలకు నూతన భవనాలు నిర్మించేందుకు బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించింది, సొంత భవనాలు వెంటనే నిర్మించాలి. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా నూతన కమిటీ ఎన్నిక ములుగు జిల్లా అధ్యక్షులు జీవన్, జిల్లా కార్యదర్శి టి,ఎల్ రవి,జిల్లా ఉపాధ్యక్షుడు జాగటి రవి తేజ, కావిరీ బైరెష్,జిల్లా సహాయ కార్యదర్శి కోగిల బాలు, జిల్లా కమిటీ సభ్యులు సోడి,అశోక్,మందపల్లి స్వామి ,దుర్గం ఉగెందర్, మడకం సిద్దు, రాంప్రసాద్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.