
నవతెలంగాణ- మద్నూర్
త్వరలోనే జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసినట్లు కాకుండా డిగ్రీ కళాశాల నడిచే విధంగా ప్రభుత్వం కావలసిన అడ్మిషన్లు భర్తీచేసి మద్నూర్ నూతన డిగ్రీ కళాశాలలో విద్యాబోధన ప్రారంభించాలని ఎం ఎస్ యు స్టేట్ లీడర్ బాలు యాదవ్ ఒక ప్రకటన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఇక్కడి విద్యార్థిని విద్యార్థులు పిల్లల తల్లిదండ్రులు ఏళ్ల తరబడి డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టిన డిగ్రీ కళాశాల సరైన సమయంలో మంజూరు చేయించడంలో అధికార పార్టీ పూర్తిగా నిర్లక్ష్యమే చేసిందని త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడి విద్యార్థిని విద్యార్థుల డిమాండ్ తల్లిదండ్రుల డిమాండ్ కు జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే హడావుడిగా డిగ్రీ కళాశాల తీసుకువచ్చారు కళాశాల కొనసాగడానికి ఏర్పాట్లు మరిచారు. డిగ్రీ కళాశాల ప్రారంభించారు. అధికారులు నియమించకపోవడం స్థానికంగా డిగ్రీ కళాశాల అడ్మిషన్ల కోసం అధికారులు ఉండకపోవడం ఈనెల 13తో అడ్మిషన్ల ఘట్టం ముగియనుంది డిగ్రీ కళాశాలలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఫోర్త్ ఫేస్ మిగలడం మద్నూర్ లో డిగ్రీ కళాశాల ఏర్పాటు అయినట్లు పిల్లలకు తెలియకపోవడం ఇతర డిగ్రీ కళాశాలలో చదువుల కోసం ప్రతి ఒక్కరూ సీట్ల ప్రయత్నం చేసుకోవడం మద్నూర్ డిగ్రీ కళాశాలకు సరైన విద్యార్థిని విద్యార్థులు అడ్మిషన్లు కావడానికి ప్రభుత్వమే చివరి సమయంలో చర్యలు చేపట్టి పిల్లలకు ఈ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రజలు అడిగారు. కదా మేము మంజూరు చేయించాము కదా అని విధంగా కాకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఈ సంవత్సరం మద్నూర్‌లో డిగ్రీ చదువులు ప్రారంభమయ్యే విధంగా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఇక్కడి ప్రజల కల డిగ్రీ కళాశాల చదువులు ప్రారంభమైతేనే నెరవేరినట్లు లేకపోతే తూతూ మంత్రంగా డిగ్రీ కళాశాల మంజూరు చేసినట్లు గొప్పలు చెప్పుకోవడానికేనని ఒక ప్రకటనలో ఆయన ఆరోపించారు అడ్మిషన్లు కాలేదు డిగ్రీ కళాశాల నడవలేదు అనుకుంటే ఇక్కడి ప్రజలు కళాశాల డిగ్రీ చదువుల పట్ల ఉద్యమం చేపట్టక తప్పదని హెచ్చరించారు. డిగ్రీ కళాశాల చదువుల ప్రారంభం కోసం కావాలి. కానీ మేము ఇచ్చాము పిల్లలు రాలేదు కళాశాల నడవడం లేదు అంటే మాత్రం మరో ఉద్యమం తప్పదని ఎం ఎస్ యు రాష్ట్ర నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు డిగ్రీ కళాశాల చదువులు ప్రారంభమయ్యే విధంగా జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిందే ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంటర్ చదువులు చదివి డిగ్రీ చదువులు చదవని వారు వెంటనే అడ్మిషన్లు చేసుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు కోరారు ఈ ప్రకటన కార్యక్రమంలో మరో నాయకులు సిద్ధప్ప పాల్గొన్నారు.