ప్రభుత్వం ఆర్టీసీ డ్రైవర్ల నియామకాల్లో అద్దె బస్సు డ్రైవర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి

– రాష్ట్ర అధ్యక్షుడు రెంక రవి
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
ప్రభుత్వం ఆర్టీసీ బస్ డ్రైవర్ల నియామకాల్లో అద్దె బస్సు డ్రైవర్లకు ప్రాధాన్యత ఇచ్చి డ్రైవర్ ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్స్, కీనర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రేంక రవి అన్నారు. గురువారం కోఠి హనుమాన్ టెక్డి బీసీ సాధికారత భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అద్దె బస్సులు నడిపే డ్రైవర్లకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. గత 15 ఏళ్లుగా ఆర్టీసీ లో బస్ డ్రైవర్లుగా పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వం బస్సు పాస్ సౌకర్యం కల్పించాలన్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది డ్రైవర్లను ప్రభుత్వం నియమించే ఆర్టీసీ నియమకాల్లో తమను తమకు డ్రైవర్ల ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు, మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వంగాల రాజు, కోశాధికారి గొల్లపల్లి రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవేందర్ రెడ్డి, రాష్ట్ర ఇన్చార్జి గడ్డం శ్రావణ్ కుమార్, సహాయ కార్యదర్శి  రవీందర్, శ్రీనివాస్, బట్ట శ్యాం, ప్రచార కార్యదర్శి బూడిద నరేష్, ఆర్గనైజ్ సెక్రెటరీ ఏ ఆర్ ప్రసాద్, ఎద్దు ప్రశాంత్, గౌరవ సలహాదారులు కాగితాల బిక్షపతి, శ్రీనివాస్ రెడ్డి ,ఎస్ బాలరాజు ,ఓ రమేష్ ,పాషా, ఓం నమశ్శివాయ, వివిధ జిల్లాల డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.