ప్రభుత్వం షరతులు ఎత్తివేయాలి

నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం జీవో 58, 59లలో పేర్కొన్న షరతులను ఎత్తేసి పేదలకు పట్టాలివ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. శనివారం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలకేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పుచ్చలపల్లి సుం దరయ్య చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం హన్మకొండ జిల్లా అధ్యక్షులు సారంపల్లి వాసుదేవరెడ్డి అధ్యక్షతన జరిగిన సమా వేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం షరతులు ఎత్తివేయకపోతే ఎల్కతుర్తిలో ఇండ్లను కట్టించినట్టే అంతటా కట్టిస్తామన్నారు. పట్టాలు ఇవ్వకపోగా బెదిరింపు లకు పాల్పడుతున్నారని, ఇలాంటి బెదిరింపులకు, కేసులకు భయపడమన్నారు. గుడిసెలు వేసుకున్న భూములను వదిలేప్రసక్తే లేదన్నారు. గుడిసెవాసులు వేసు కున్న స్థలాల్లో సర్వే చేసి కలెక్టర్‌ వెంటనే పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ పేదల పక్షానవుంటారా? లేక భూ కబ్జాదారుల పక్కన వుంటారో తేల్చుకోవాల న్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామి మేరకు ప్రతియేటా 1 లక్ష ఇండ్ల చొప్పున 8 లక్షల డబుల్‌ బెడ్రూంఇండ్లను నిర్మించి ఇవ్వాల్సి వుండగా, కేవలం 3 లక్షల ఇం డ్లను మాత్రమే పూర్తిచేశారన్నారు. ఎల్కతుర్తి సుందరయ్యనగర్‌లో పేదలు నిర్మిం చుకున్న కాలనీకి మంచినీటి వసతిని కల్పించాలని, వీధి దీపాలతోపాటు రోడ్లను నిర్మించాలని స్థానిక అధికారులు, సర్పంచ్‌ను డిమాండ్‌ చేశారు.
‘పుచ్చలపల్లి’ ఆదర్శప్రాయుడు : బొట్ల చక్రపాణి
కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన పుచ్చలపల్లి సుందరయ్య అందరికీ ఆదర్శప్రాయుడు అని సిఐటియు హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు బొట్ల చక్రపాణి అన్నారు. ఎల్కతుర్తిలో సుందరయ్యనగర్‌గా వెలిసిన ఈ ప్రాంతంలో ప్రారంభిం చుకున్న ఈ కార్యాలయం విజ్ఞాన కేంద్రంగా వెలసిల్లాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం హన్మకొండ జిల్లా అధ్యక్షులు సారంపల్లి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ మీ పోరాటం వృథాకాలేదని, మీరు చేసిన పోరాట ఫలితంగా 120 ఇండ్లను నిర్మించు కోవడమే కాకుండా వ్యవసాయ కార్మిక సంఘానికి కార్యాలయాన్ని నిర్మించుకో వడం అభినందనీయమన్నారు. తొలుత ఈ కార్యక్రమంలో పతాకాన్ని సారంపల్లి వాసుదేవరెడ్డి ఆవిష్కరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుమ్మడిరాజుల రాములు మాట్లాడుతూ ఇక్కడ భూపోరాటం ఈస్థాయికి చేరుకో వడానికి ఎన్నో వ్యయప్రయాసాలను ఎదుర్కొన్నామన్నారు. పేదలకు పట్టాలి వ్వాలని ఈనెల 29న తలపెట్టిన కలెక్టరేట్‌ ముట్టడిలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు స్వరూప, సిఐటియు జిల్లా ఉపా ధ్యక్షులు అశోక్‌, స్వరూప, సతీష్‌, మమత, అరుణ తదితరులు పాల్గొన్నారు.