– వడగండ్ల వానతో బొప్పాయి తోట ధ్వంసం
– ఆందోళన చెందుతున్న అన్నదాతలు
– ఆరుట్ల సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీటీసీ చీరాల రమేశ్
– నవతెలంగాణ-మంచాల
మండల పరిధిలోని ఆరుట్ల గ్రామంలో ఆదివారం కురిసిన అకాల వర్షానికి ,ఈదురు గాలులకు, వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటకు ప్రభుత్వం వెంటనే నష్ట పరి హారం ఇవ్వాలని ఆరుట్ల సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీటీసీ చీరాల రమేశ్ అన్నారు. సోమవారం ఆరుట్ల గ్రామంలో వర్షానికి దెబ్బ తిన్న బొప్పాయి తోటను పరిశీ లించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం కురిసిన వడగండ్ల వానకు రైతు ఆడేపు నర్సింహ రెండు ఎకరాల్లో వేసిన బొప్పాయి తోట వేశాడు. ఆ పంట మరో రెండు రోజుల్లో బొప్పాయికాయలు కోయాల్సి ఉండగా, వడగండ్ల వాన రావడంతో చెట్లలన్నీ నెలకొరిగి లక్షల రూపాయల్లో నష్టం వాటిల్లిందన్నారు. ఆ గ్రామంలో చాలా మంది రైతులు బొప్పాయి తోట వేశారు. ఈ వడగంట్ల వానతో తోటలు ధ్వంసం కావడంతో రైతులు నష్ట పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్ప టికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులం దరికీ పరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాండాల జంగయ్య గౌడ్, రైతు సంఘం నాయ కులు చిందము రఘుపతి, మార్కెట్ కమిటీ డైరక్టర్ మహ మ్మద్ జానీపాషా, చిందము జంగయ్య, గుడ్డీమల్ల చంద్ర య్య, సుంకరి ప్రవీణ్ కుమార్, పున్నము రాము, వెంకటేష్, మోహన్‌రెడ్డి, ఎండీ ఆశ్రఫ్ తదితరులు పాల్గొన్నారు.