నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

– హుస్నాబాద్ ఆర్డీవో కు వినతిపత్రం అందజేత
 – నియోజకవర్గం ఇంఛార్జ్ బత్తుల శ్రీనివాస్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని టిడిపి హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ బత్తుల శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం టిడిపి నాయకులు హుస్నాబాద్ ఆర్డిఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను, ఆస్తి నష్టపోయిన  ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే  ఆదుకోవాలని కోరారు. తొమ్మిది సంవత్సరాలుగా రైతులు నష్టపోతున్నారని తెలిసిన ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదన్నారు. మండలంలోని చాలా గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులన్నీ  తెగిపోయాయని, దారులను వెంటనే బాగు చేయాలని అన్నారు . ఇళ్లు కోల్పోయిన వారికి ఆశ్రయం కల్పించేందుకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల,పట్టణ అధ్యక్షులు మామిడి తిరుపతి, వరయోగుల శ్రీనివాస్, కార్యదర్శులు బత్తుల శంకర్, బైరి శ్రీనివాస్, నాయకులు ఎండీ హాసన్,ఆకుల వెంకటేష్ చల్లం వీరయ్య తదితరులు పాల్గొన్నారు.