ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు వివరించాలి

నవతెలంగాణ-భిక్కనూర్
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఇస్సన్న పల్లి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, పనిచేసే కార్యకర్తలకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని ప్రభుత్వం మోసం చేస్తుందని, రాహుల్ గాంధీ డిక్లరేషన్ ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షులు తిరుమల స్వామి, గ్రామ శాఖ అధ్యక్షులు యాదగౌడ్, ఉపాధ్యక్షులు నారాయణ, యూత్ అధ్యక్షులు బాబు, ఉపాధ్యక్షులు రాములు నాయకులు, గోపాల్ రెడ్డి, యాదగిరి, సత్తయ్య లింగం, శ్రీనివాస్, స్వామి, శ్రీశైలం, నవీన్ తదితరులు పాల్గొన్నారు.