ఎస్ఎఫ్ఐ పోరాటాల ఫలితమే డిగ్రి కళాశాల మంజూరు

నవతెలంగాణ- వీర్నపల్లి 
వీర్నపల్లి మండల కేంద్రంలో ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుమార్ అధ్వర్యంలో ఎస్ ఎఫ్ ఐ నాయకుల పోరాట ఫలితంగా ఎల్లారెడ్డి పేట మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేసిందని ఎస్ ఎఫ్ ఐ నాయకులు గురువారం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ సంబరాలు జరుపుకున్నారు. కళాశాల మంజూరు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కూడా ఎస్ఎఫ్ఐ ఎల్లప్పుడూ  ముందుంటుందని విద్యార్థుల సమస్యలు పరిష్కారంలో ముందుండే ఎస్ ఎఫ్ ఐ సంఘంలో చేరి విద్యార్థులు తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నాయకులు రాకేష్, తరుణ్, సంజయ్, ప్రదీప్ విద్యార్థులు పాల్గొన్నారు.