ఎనిగ్మా నుంచి జిటి 450 ఇ-స్కూటర్‌

భోపాల్‌ : విద్యుత్‌ వాహనాల తయారీదారు ఎనిగ్మా ఆటోమొబైల్స్‌ కొత్తగా జిటి450, క్రింక్‌ హైస్పీడ్‌ వేరియంట్‌ ఇ-స్కూటర్‌లను ఆవిష్కరించింది. జిటి450 ఎక్స్‌షోరూం ధరను రూ.89,000గా, క్రింక్‌ ధరను రూ. 94,000గా ప్రకటించింది. వీటిని ఫేస్‌-2, అమెండ్‌మెంట్‌ 3 అనుమతు లు పొందిన లిథియం ఐయాన్‌ బ్యాటరీలతో విడుదల చేసినట్లు తెలి పింది. బైక్‌ దేకో, ఎనిగ్మా ఆన్‌లైన్‌ సైట్‌లలో ఈ వాహనాలను బుక్‌ చేసుకో వచ్చని పేర్కొంది. క్రింక్‌ గంటలకు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో, జిటి 450 గంటకు 60 కిలోమీటర్ల చొప్పున ప్రయాణించగలవని తెలిపింది.