– కార్పొరేషన్ చైర్మెన్ వాసుదేవ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో ఎక్కడా లేని విధంగా వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక పింఛన్‌ను ఇస్తున్నదని వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.వికలాంగులకు సీఎం కేసీఆర్ కొండంత అండగా నిలిచారని కొనియాడారు. ఒకే సారి వెయ్యి రూపాయలు పెంచుతూ జీవో జారీ చేయటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో బాణా సంచా కాల్చి సంబురాలు చేసుకున్నారని తెలిపారు.పెరుగుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా పింఛన్‌ను పెంచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వికంగుల నాయకులు మున్నా, గుత్తికొండ కిరణ్, నల్లగొండ శ్రీనివాస్ సుమన్, రాజ్యలక్ష్మి, కొమురెల్లి, వేణు,నాగరాజు, మనీ, తదితరులు పాల్గొన్నారు.