హైదర్‌నగర్‌లో హిందూ స్మశాన వాటికను అభివద్ధి పరచాలి

సీపీఐ(ఎం) కూకట్‌పల్లి మండల
కార్యదర్శి ఎం శంకర్‌
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
హైదర్‌నగర్‌ డివిజన్లోని హిందూ స్మశాన వాటికను అభివద్ధి పరచాలని సీపీఎం కూకట్‌ పల్లి మండల కార్యదర్శి ఎం. శంకర్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం హైదర్నగర్లోని హిందూ స్మశాన వాటికను సీపీఎం నాయకులు సందర్శించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ హిందూ స్మశాన వాటికను అభివద్ధి చేయాలని గతంలో పలుమార్లు స్థానిక ఎమ్మెల్యేకు, కార్పొరేటర్‌, జోనల్‌ కమిషనర్కు, ఎమ్మార్వొలకు వినతి పత్రాలను అందజేసిన సమస్య మాత్రం పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఇతర చోట్ల ఎలా అయితే అభివద్ధి చేశారో అలానే ఇక్కడ కూడా హిందూస్‌ స్మశాన వాటికను అభివద్ధి చేయాలని కోరారు. శ్రీనివాస్‌, అశోక్‌ యాదవ్‌, మహేష్‌ గౌడ్‌, రామకష్ణ , మహేష్‌, వెంకటేష్‌ ,పాల్గొన్నారు.