పవిత్రమైన పండగ రంజాన్ : ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి

నవతెలంగాణ – గోవిందరావుపేట
పవిత్రమైన రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకోవాలని ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ జరుపుల మమత ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరులకు ప్రభుత్వ కానుక నూతన దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మండల ముస్లిం మైనార్టీ సోదరులందరికీ ఇఫ్తార్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపవాస దీక్షలు పాటించిన ముస్లిం సోదరులు నెలవంక కనిపించగానే రంజాన్ పండుగను ఎంతో పవిత్రంగా నిర్వహించుకుంటారు అని అన్నారు. హిందూ ముస్లిం సోదరులు ఎంతో మనస్ఫూర్తిగా ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుని ఆడంబరంగా నిర్వహించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ మహమ్మద్ బాబర్ తో పాటు ఏక్బాల్, ఎం.ఆర్.ఐ రాజేందర్, ఏ ఆర్ ఐ సుధాకర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.