– స్టే హౌం ప్రారంభంలో శ్రీమతి
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
కుటుంబంలో సమస్యలు ఎదురైప్పుడు, ఒంటరిగా ఉన్న ప్పుడు భద్రత, భరోసా కల్పించే విధంగా షార్ట్ స్టేహౌమ్ ఉపయోగపడు తుందని ఐద్వా జాతీయ అధ్యక్షులు పీకే శ్రీమతి తెలిపారు. వీరనారి ఐలమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళాదినోత్సవం సందర్భంగా తాత్కాలిక వసతి గృహాన్ని ప్రారంభించారని ట్రస్ట్ కార్యదర్శి బి హైమావతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐలమ్మ ట్రస్టును 2014లో ఏర్పాటు చేశామనీ, దీని ద్వారా ఉచిత కుటుంబ న్యాయ సలహా కేంద్రాలు,మెడికల్ క్యాంపులు, బాలోత్సవాలు, బాలికలకు కరాటే శిక్షణా కేంద్రాలు వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొ న్నారు. ఈ క్రమంలోనే తాత్కాతిక వసతి గృహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షురాలు బుగ్గవీటి సరళ అధ్యక్షత వహించగా, ట్రస్టు కార్యదర్శి బత్తుల హైమవతి, కోశాధికారి కె.ఎన్ ఆశలత, ట్రస్టు సీనియర్ సభ్యులు టి. జ్యోతి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, అధ్యక్షులు ఆర్, అరుణజ్యోతి, ఐద్వా నాయకులు, శాంతకుమారి, ఎమ్ వినోద, పి, శశికళ, కమలకుమారి, కౌన్సిలింగు కేంద్రం కన్వీనర్, విశాలాక్షి, జర్నలిస్టు ఉదయలక్ష్మి, గాయత్రి, కమలమ్మ, న్యాయవాది లీలావతి సైకాలజిస్టు అమ్మాజి తదితరులు పాల్గోన్నారు.