రోడ్డు ప్రమాదాల నివారణకు పసర పోలీస్ స్టేషన్ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. గతంలో పసర పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమలగడ్డ క్రాస్ రోడ్ వద్ద తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతు ఉండేవి.గతం లో ప్రాణ నష్టం కూడా సంభవించిన సందర్భాలు ఉన్నవి. రోడ్ డివైడర్ ప్రారంభవటం, రాత్రిపూట ఎలాంటి లైట్ లేకపోవటం, ప్రమాదం జరగటానికి ఎక్కువ అవకాశం ఉన్నందున ప్రమాదాలు తగ్గించుట కొరకు సీఐ రవీందర్ , ఎస్సై కమలాకర్ కలిసి విన్నూతంగా ఆలోచించారు. బుధవారం ట్రాక్టర్ టైర్ కి రేడియం స్టికెర్స్ అంటించి రోడ్ డివైడర్ ప్రారంభం లో ఉంచటం జరిగింది. దీనితో రాత్రిపూట వాహనాల లైట్ వెలుగులతో రేడియం స్టికెర్స్ మెరుస్తుండటం తో ప్రమాదాలు చాలా వరకు తగ్గటానికి అవకాశం ఉంది అని సీఐ రవీందర్ తెలిపారు. వాహనదారులు కూడా ప్రమాదాల నివారణకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకొని ప్రయాణించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు పోలీసుల ఆలోచనలను వాహనదారులు స్వాగతించారు. రహదారి వెంట ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలలో ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టలని ప్రజలు కోరుతున్నారు.