జీపీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

– సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. రామకృష్ణ
– వినూత్నంగా గ్రామపంచాయతీ కార్మికుల నిరసన
నవతెలంగాణ-పరిగి
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. రామకృష్ణ అన్నారు. ఆదివారం పరిగి పట్టణ కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె నాలుగో రోజు కొనసా గింది. ఈ సందర్భంగా పరిగి ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉరిచారులతో గ్రామపంచాయతీ కార్మికులు నిర సన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే గ్రామపంచాయతీ కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు బాబయ్య, బాలయ్య, నర్సింలు, శ్రీనివాస్‌, పెంటయ్య, రాజు, మాన య్య, పద్మమ్మ, భీమామ్మ, అనంతమ్మ, అనం తమ్మ, నరస మ్మ, యాదమ్మ, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.