– వైట్‌హౌస్
న్యూఢిల్లీ : భారత్-అమెరికా సంబంధాల్లో అత్యంత ముఖ్యమైన అంశం ‘ప్రజాస్వామ్య ఆరోగ్యం’ అని వైట్‌హౌస్ సీనియర్ అధికారులు వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీతో అమెరికా అధ్యక్షులు బైడెన్ జరిపే ప్రతి సమావేశంలోనూ ఈ అంశాలు చర్చకు వస్తాయని అన్నారు. శుక్రవారం రాత్రి బైడెన్, మోడీ ద్వైపాక్షిక సమావేశం అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కర్ణాటక రాష్ట్ర ఎన్నికల గురించి వారు ఆ సమావేశంలో ప్రస్తావించారు. తమ పాలనలో వున్న కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగానే మోడీ ఆ పార్టీకి బహిరంగంగా శుభాకాంక్ష లు అందచేయడాన్ని గుర్తు చేస్తూ, ప్రజాస్వామ్యంలో ఇదొక సానుకూల సంకేతమని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షులు బైౖడెన్ సదస్సుకు హాజరవుతున్నందుకు సంతోషించినా రష్యా, చైనా అధినేతలు పుతిన్, జిన్‌పింగ్ రాకపోవడంతో భారత్ తీవ్రంగా నిరాశ చెందిందని అధికారులు వ్యాఖ్యానించారు. జీ-20 సదస్సు ముగింపులో సంయుక్త డిక్లరేషన్ వెలువడే అవకాశాల గురించి మాట్లాడుతూ, ముఖ్యంగా ముసాయిదాలో వాతావరణ అంశాలపై కొంత పురోగతి వుందని చెప్పారు.
భారత్-అమెరికా-సౌదీ అరేబియా-యురోపియన్ యూనియన్ ఇన్ఫ్రాస్ట్రకర్చర్ కారిడార్ గురించి మాట్లాడుతూ, జి-20 సదస్సుకు ఢిల్లీకి వచ్చిన పక్షాలతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. అమెరికా నావికాదళ ఆస్తులు, ఇతర విమానాలు, నౌకల నిర్వహణ, మరమ్మత్తులకు భారత్‌ను ఒక కేంద్రంగా ఉపయోగించుకోవడానికి ఇరు పక్షాలు కట్టుబడి వున్నాయని సమావేశం అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటన పేర్కొంది. భారత్‌లో విమానాల నిర్వహణ, మరమ్మత్తుల కేంద్రాల్లో అమెరికా పరిశ్రమలు మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన హామీలను నేతలు స్వాగతించారని పేర్కొంది. ఈ ప్రకటనను విమర్శిస్తూ సీనియర్ కాంగ్రెస్ నేత, ఎంపి మనీష్ తివారీ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించిన నేతల సతీమణులు
ఒకపక్క నేతలు చర్చల్లో మునిగితేలుతుండగా, వారి సతీమణులు భారత్ హరిత విప్లవానికి కేంద్ర స్థానమైన న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్‌ఐ) కేంపస్‌ను సందర్శించారు. భారతీయ వ్యవ సాయ రంగం సాధించిన ప్రగతిని వీక్షించారు. పొలంలో చిరుధాన్యాల పం టలను, వాటితో పలు రకాల వంటలను వారు ఆస్వాదించారు. జీ-20 నేత ల సతీమణుల ప్రతినిధి వర్గంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజరు బంగా భార్య రితూ బంగా వున్నా రు. మిల్లెట్ల రంగోలితో వారికి బ్రహ్మాండంగా స్వాగతం పలికారు. 18 దేశాలకు చెందిన వివిధ రకాల చిరు ధాన్యాల ఎగ్జిబిషన్‌ను వారు వీక్షించారు.