రాజులు పోయి…

రాజులు పోయి...రాజులు, రాజ్యాలు వస్తూ పోతూ ఉంటేనే ప్రజల బాగోగులు తెలిసేది, బాగు పడేది. పాత సీసాలో కొత్త సారా అన్నట్టు అదే రాజులు అటూఇటూ వస్తూపోతూ తమకు పాచి పట్ట కుండా చూసుకుంటారేమో అనిపిస్తుంది. ప్రవాహం ఉంటేనే నీళ్లలో పాచిపట్టకుండా ఉండేది. అందుకే నాటకీయ పరిణామాల్లో అనిపించేటట్టు గోడ మీది పిల్లుల్లా మాత్యులు అమాత్యులై పోతుంటారు ఒక్క ఉదుటన. ఇంకొందరేమో మేము ఇంతమంది ముఖ్య మంత్రుల దగ్గర పనిచేశామని తమ మెడలో తామే సర్టిఫికేట్లు వేసుకొని వ్యాపారం చేస్తుంటారు. అదే దానిపై ఎన్ని పార్టీలు మారిందీ ఉండనే ఉండదు. అది గోప్యంగా ఉంచుతారు ఈ ‘గోపి’లు.
ఒక్కోసారి ప్రజాస్వామ్యాన్ని చూస్తే అమితమైన ఆకర్షణ వేస్తుంది. ఎప్పటికైనా ప్రజలే రాజులని, వాళ్ళే పాలకులనీ ఇంకా ఏవేవో ఊహలు గుసగుస లాడతాయి మన మనసులో. అవన్నీ నిజం కాకపోవచ్చు కాని ఎంతోకొంత నిజం లేకపోనూ లేదందులో. అయితే ఈ ప్రజాస్వామ్యమనే ప్లాస్టిక్కు పండుపై మనకు ఏవైనా అనుమానాలు, ఆశలు ఉంటే డా.అంబేడ్కర్‌ మహాశయుడు చెప్పిన మాటలు వినాలి. ఎడారిలో ఎండమావులు కనిపిస్తే దాహంగా ఉన్నవాళ్ళకు నిజంగా అవి నీళ్ళలాగే కనిపించి అక్కడిదాకా నడిచే శక్తి వస్తుంది. సరిగ్గా సేమ్‌ టు సేమ్‌ ప్రజా స్వామ్యంపై అవే ఫీలింగులు కలుగు తాయి. అవే ఫలితాలు వస్తూ పోతుంటాయి కొన్ని భ్రమలు కల్పిస్తూ. నిరంకుశ పాలన అని, ఇంకోటనీ ఎంతసేపూ నాయకులను నాయకులే తిడుతుం టారు. ఓడినవారిలో ఒక్కరూ ప్రజల్ని ఒక్క పరుష మైన మాటా అనరు. అలాగే గెలిచినోళ్లు ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని ఒకటే పొగిడేస్తుంటారు, మాట లకు అస్సలు తడుము కోకుండా. గెలిచిన ప్పుడు ఉండే పవరది. ఓడినప్పుడు ఉండే ఫియరది.
ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయ్యాయని పాత డైలాగులే వాడతారు కొందరు. బోట్లు ఆడీ కార్లు, ఆడీకార్లు బోట్లు అయ్యాయని చెప్పుకో వాలిప్పుడు. ఆడీ కారు రోడ్డు మీద చూడడానికే కాని మారుతి ఎనిమిది వందలో లేదా ఇంకో మామూలు కారు లోనో పోవడం చూస్తుంటాము. మాట లకు హద్దులుండవు, ఊహలకూ అంతే. మేము వాటిని నిజం చేశామని చెప్పే ప్రబుద్ధులు ఎక్కువే. ఏమైతేనేం ఇక్కడి మా గెలుపు దేశానికే మార్గద ర్శనం చేస్తుందని గెలిచిన చోట్ల చెప్పే మాటలు ఓడిన చోట ఉండవు. అదే రాజకీయ శాస్త్రం, రాజనీతి శాస్త్రం చెప్పేది. అసలు ఇలాంట ప్పుడు చాణక్యుడేమి చెప్పాడబ్బా అని వెదుకుతారు కూడా. ఇక భగవద్గీత పుట్టినవాడు మరణించక తప్పదు అంటుంది కాబట్టి గెలిచినవాడు ఓడక తప్పదు అని కొద్దిగా తమకు అనుకూలంగా మార్చు కొని తృప్తి పడే అవకాశం కూడా ఉంది. ఓడినవాడు ఓడానని గెలుస్తుంటే, గెలిచిన వాడు ఎందుకు గెలిచానని ఏడుస్తాడట యుద్ధాల విషయంలో.
ఐస్‌క్రీము ఫ్యామిలీ ప్యాకు తినవలసి నోళ్లు ఒక చిన్న కప్పుతో, ఒక చిన్న కేకుతో ఇక చాల్లే అనుకునే అవకాశమూ ఉంది ఈ ఎన్నికల్లో. రా ష్ట్రాల్లో వచ్చినవెన్ని, పోగుట్టుకున్నవెన్ని అన్న విష యం తెలుసుకోవాలి. మిత్రుల్ని కలుపుకొని, తమ శక్తి తెలుసుకొని, అవతలివారి బలహీనతల్ని వాడు కోవలసింది పోయి చిన్నచిన్న విజయాలతో పొంగి పోయేవారిని చూస్తే జాలేస్తుంది. పెద్ద య్యాక ఏమవుతావురా అంటే సైకిల్‌ షాపు పెడ తా అన్న తమాషా డైలాగులు గుర్తొస్తాయి ఒక్కొ క్కసారి. నాయకు డన్నవాడికి కొద్దిగా త్యాగం కూడా తెలిసుండాలని అనిపి స్తుంది. దేశాన్ని మొత్తం పాలించే విధంగా ప్రణా ళిక వేయవలసింది పోయి చిన్న చిన్న విజయాలకు ఎవరి భుజం వాళ్లు సెహభాష్‌ అని కొట్టుకొని మురి సిపోతే అవతలివాడికే లాభం. దీర్ఘకాలిక శత్రువులు ఎవరు, స్వల్పకాలిక శత్రువులెవరు అని తెలుసు కోవాలి. సొంతంగా మెదళ్లు పనిచేయకపోతే ఇ ప్పుడు కృత్రిమ తెలివి అని ఒకటి బాగా పని చేస్తోం ది కాబట్టి వాటిని వాడుకోవచ్చు. అప్పుడు నిజంగా ఉండే తెలివి సైతం సహకరించవచ్చు. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే, జేబులు ఖాళీలాయనే అని బాధపడకుండా అనుభవం వచ్చిందని సంతో షించాలి. ఇప్పుడు అంత కన్న మార్గం లేదు జీవిం చడానికి. మార్కెట్లో ఉన్న వ్యక్తిత్వ వికాస పుస్తకా లన్నీ తిరగెయ్యాలిప్పుడు. అలాగే కాళ్ళకు పని పెట్టాలి మిగిలిన రాష్ట్రాల్లో. ఊరకే భారత్‌ జోడో అంటే సరిపోదు, మిత్రోంకో జోడో అని పెద్దన్న వే షం కట్టాలిప్పుడు. దేశం కోసం త్యాగాలు చేశామని చెప్పడం కరెక్టే కాని దేశం బాగుపడాలంటే రానున్న అధికారంలోనూ త్యాగం చేసి కొంత మిత్రులకి వ్వాలి. అదే నిజమైన త్యాగం.
నేను దేశాన్నంతటినీ కులాలకు, మతాలకు అతీ తంగా ఏకతాటిపై నడుపుతానంటే మంచిదే కాని దానికి సహకరించే వాళ్ళను దగ్గరికి తీసుకోవాలి, వ్యతిరేకంగా ఉన్న శక్తుల్ని బలహీనం చేసి నీవు బా ధ్యతాయుతమైన స్థానంలో ఉంటావా లేక రాజులు వస్తుంటారు పోతుంటారు అని చేతులెత్తేసి తత్వా లు చెప్పుకుంటావా అన్నది నీవే తేల్చుకోవాలి. ప్రజ లందరినీ ఒక తాటిమీదకు తెస్తేనే రాజవుతాడు. విడగొడుతూ రాజైనోడు ఎక్కువరోజులు ఉండ కూడదు మరి.
జంధ్యాల రఘుబాబు
9849753298