
మండలంలోని పర్యాటక కేంద్రం లక్నవరం చెరువు గురువారం నుండి ఉదృతంగా మత్తడి పోస్తుంది. గత అర్ధరాత్రి 33 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకోగా మత్తడి ప్రారంభమైనట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలుపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు నాలుగు నుండి ఆరు అడుగుల పైబడి ఎత్తుతో మత్తడి పోయడం కొత్తగా చూస్తున్నామని స్థానికులు తెలుపుతున్నారు. వేలాడే వంతెన పైకి సుమారు రెండు ఫీట్ల ఎత్తున నీరు చేరి నీటిలో ఊగుతూ సందర్శకులకు కనువిందు చేసింది. పర్యాటకులను వుపుతూ ఉండే ఈ వంతెన నేడు నీళ్లలో ఊగుతూ కనిపించిందని స్థానికులు తెలుపుతున్నారు.