గద్దర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన: చిన్న రాజు

నవతెలంగాణ – ఐనవోలు
ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) అకాల మరణం పట్ల హనుమకొండ జిల్లా కమిటీ మెంబర్ జీఎంపీస్ మండల ప్రధాన కార్యదర్శి  నల్లబెట్టచిన్న రాజు తన సంతాపాన్ని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో తన పాటద్వారా పల్లె పల్లెన భావ జాలవ్యాప్తి చేసిన గద్దర్ మరణం చాలా బాధాకరమని,ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.