తిరువీర్ ప్రధాన పాత్రలో రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకత్వం వహించిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘పరేషాన్. సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. హీరో రానా సమర్పణలో ఈనెల 2న ఈ చిత్రం విడుదలై, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ,”కేరాఫ్ కంచరపాలెం, సినిమా బండి, బలగం’ చిత్రాలు చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో అలాంటి ఫీలింగే ఈ సినిమా చూసినప్పుడు కలిగింది. సినిమా చూసినప్పుడు మనల్ని మనం మర్చిపొతే అదే మ్యాజిక్. అలాంటి మ్యాజిక్ ఈ సినిమాకీ జరిగింది’ అని తెలిపారు. ”లగాన్’ లాంటి టీం కలిసి చేసిన సినిమా ఇది. నేర్చుకుంటూనే సినిమా చేశాం. గెలవాలంటే లాస్ట్ బాల్‌కి సిక్స్ కొట్టాలి. మా అదృష్టం.. రానా వచ్చి సిక్స్ కొట్టించారు. ప్రేక్షకులు కోసం తీసిన సినిమా ఇది. సినిమా చూసిన అందరూ హ్యాపీగా ఫీలవుతున్నారు’ అని హీరో తిరువీర్ చెప్పారు.