స్వచ్చంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన నలంద పాఠశాల యాజమాన్యం

నవతెలంగాణ- కంటేశ్వర్:

నలంద పాఠశాలలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో స్వచ్చంద రక్తదాన శిబిరం శుక్రవారం ఏర్పాటు చేసి పాఠశాల యాజమాన్యం లోని ఉపాధ్యాయులు  విద్యార్థుల తల్లి తండ్రులు ముందుకు వచ్చి స్వచ్చందంగా రక్తదానం చెయ్యడం జరిగింది. ఇందులో 28 యూనిట్ల రక్తం సేకరించడం జరిగింది. అలాగే 8 , 9 ,10 వ తరగతుల విద్యార్థులకు అత్యవసర పారిస్తుతుల్లో ఇతరుల ప్రాణాలు ఎలా కాపాడాలని డా.శ్రీశైలం  సి.పి.ఆర్ నేర్పించడం జరిగింది. ఇందులో సుమారు 250 మందికి పైగా విద్యార్థులు  యాజమాన్యం పాల్గొని సి.పి.ఆర్ తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన పాఠశాల యజమానులు మురళి కృష్ణ ని రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు అభినందిస్తూ ఇలాగె కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులని చైతన్యపరచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మావతి, కమిటీ మెంబెర్ నేహ, ఉపాధ్యాయులు మురళి, అశోక్ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.