విప్ ను సన్మానించిన మార్కెట్ కమిటీ పాలకవర్గం

నవతెలంగాణ -భిక్కనూర్
వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సోమవారం కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ను ఘనంగా సన్మానించారు. మండల కేంద్రంలో గల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో అధ్యక్షులుగా హనుమంత్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా పురాం రాజమౌళి, డైరెక్టర్‌గా రాకేష్ రెడ్డి పదవీ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరై పదవి భాద్యతలు చెప్పటినవారిని అభినందించారు. అనంతరం పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే గోవర్ధన్ ను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పాలకవర్గ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.