మాస్‌ మంత్ర పాట.. బాలయ్య వ్యక్తిత్వానికి ప్రతిబింబం

‘మా బాలయ్య బాబు బంగారు కొండ. ఫ్యాన్స్‌ అంటే బాలయ్య బాబుకి చాలా ఇష్టం. బాలయ్య అంటే జగన్‌కి పిచ్చి. ఈ బర్త్‌డేకి ‘మాస్‌ మంత్ర’ పేరుతో అద్భుతమైన సాంగ్‌ చేశాడు. ఈ పాట అద్భుతంగా ఉంది. బాలయ్య బాబు వ్యక్తిత్వాన్ని అద్భుతంగా చూపించారు. అభిమానుల మనసులో నుంచి వచ్చిన పాట ఇది’ అని అన్నారు దర్శకులు బి గోపాల్‌.
నేడు (శనివారం) బాలకష్ణ బర్త్‌ డే. ఈ సందర్భంగా రూపొందించిన ‘మాస్‌ మంత్ర’ స్పెషల్‌ సాంగ్‌ లాంచింగ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరిగింది. అనంతరపురం జగన్‌ సమర్పణలో రూపొందిన ఈ పాట లాంచింగ్‌ ఈవెంట్‌లో డైరెక్టర్స్‌ బి.గోపాల్‌, గోపీచంద్‌ మలినేని, అనిల్‌ రావిపూడి, నిర్మాత శివలెంక కష్ణ ప్రసాద్‌, సాహు గారపాటి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.’బాలయ్య బాబుతో ‘వీరసింహా రెడ్డి’ సినిమా చేసే అదష్టం దక్కింది. ఫ్యాన్స్‌ అందరూ బాలయ్య బాబుని ఎలా ఇష్టపడతారో, అలా వాళ్ళ మనసు నుంచి వచ్చిన పాట ఇది. పాటలో బాలయ్య వ్యక్తిత్వం కనిపిస్తోంది. బాలయ్య బాబు అంటే రాజసం, బాలయ్య బాబు అంటే పూనకం. ఈ పాట జనాల్లోకి బాగా వెళ్తుంది’ అని దర్శకుడు గోపీచంద్‌ మలినేని అన్నారు.
దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ, ‘ఈ పాట చాలా బావుంది. లిరిక్స్‌, విజువల్స్‌.. బాలకష్ణకి యాప్ట్‌ అనిపించింది. బాలయ్యతో చేస్తున్న ‘భగవంత్‌ కేసరి’ జర్నీ నా లైఫ్‌లో చాలా స్పెషల్‌. ఈ సినిమా విడుదలయ్యాక ప్రతి అభిమానికి జర్నీ అఫ్‌ భగవంత్‌ కేసరి గుర్తుండిపోతుంది’ అని తెలిపారు.