
నవతెలంగాణ- కంటేశ్వర్:
14 ఏళ్ల చిన్నారిని ప్రాణాంతక చర్మ వ్యాధి నుంచి కాపాడామని యశోద హాస్పిటల్ వైద్య బృందం సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ ఎల్ సుదర్శన్ రెడ్డి డాక్టర్ వెంకటరమణ అన్నారు. ఈ మేరకు శనివారం నగరంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాకు చెందిన శ్రేయ ఠాకూర్ 14 సంవత్సరాల బాలికకు సంక్లిష్టమైన వ్యాక్సిన్ ఎఫీడెర్మల్ నేక్రోలీసిన్ 10 సమస్యతో మా వద్దకు వచ్చారని, ఈ వ్యాధి లామో ట్రీజన్, ఆక్స్ కార్ బజే ఫైన్ ల అనే మందులు ఉపయోగించడం వల్ల చిన్నారికి ఈ పరిస్థితి వచ్చిందని వైద్యులు తెలిపారు.ఈ వ్యాధి వచ్చిన చిన్నారిని వెంటిలేషన్ పై ఉంచి అరుదైన వైద్యాన్ని అందించడం జరిగిందని 48 గంటలు డాక్టర్ల బృందం శ్రమించి పాపకు ప్రాణాపాయస్థితి నుంచి కాపాడమని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పాపను బ్రతికించడం నిజంగా వైద్య చరిత్రలో ఒక మైలు రాయి అని అన్నారు. చికిత్స ప్రయాణంలో ఇంటెన్సీ కేర్ ఇంటర్ బిజినెస్ యాంటీబయోటిక్స్ పొటాషియం కరెక్షన్ యాంటీ మందులు ప్లాస్టిక్ సర్జరీ ఇతర సహాయక చర్యల వల్ల సమస్య మెరుగవడంతో ఆక్సిజన్ సపోర్ట్ ని విజయవంతంగా తొలగించామని రక్త పరీక్షలు అసినేటో డాక్టర్ బహుమని సంఖ్య పెరుగుదలని గమనించామని దీనిని యాంటీబయోటిక్స్ మెనూ సైక్లిన్ ఇంజక్షన్ సూచించగా సూచించామని 48 గంటల వైద్యం తర్వాత చేసిన పరీక్షలలో ఎటువంటి పెరుగుదల కనిపించలేదని ఈ చికిత్స యొక్క ప్రభావాన్ని ధీకరిస్తుందని అన్నారు. శ్రియ కేసు సహకార వైద్య నైపుణ్యం కలిగిన డాక్టర్ల యొక్క ప్రతిభను ప్రదర్శించిందని డాక్టర్ ఎల్ సుదర్శన్ పేర్కొన్నారు. తమ ఆసుపత్రి బృందం యొక్క అంకితభావం సమయానికి ఆమె పట్ల వారు చూపించిన వైద్య పరిరక్షణ కారణంగా ఆమె క్రమక్రమంగా కోలుకోవడం జరిగిందన్నారు. గత 30 సంవత్సరాలుగా హైదరాబాదులోని యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నాలుగు బ్రాంచీలు సికింద్రాబాద్ సోమాజిగూడ మలక్పేట్ హైటెక్ సిటీలలో 4 వేల పడకలు కలిగిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా వైద్య అవసరాలకు అనుగుణంగా అనుభవం అనుభవంతులు అయిన వైద్యులచే అధునాతన సాంకేతికతతో అందరికీ చేరువలో కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారిందని అన్నారు. తమ పాపను బ్రతికించిన దేవుళ్ళు యశోద హాస్పిటల్ వైద్యులు అని తమ పాపకు 2016 నుంచి ఫిట్స్ వ్యాధి రావడంతో మహారాష్ట్ర నాందేడ్ లో వైద్యుల వద్ద వైద్యం అందిస్తున్నామని రెగ్యులర్గా టాబ్లెట్స్ వాడుతున్నామని శ్రేయ తండ్రి అన్నారు. ఫిట్స్ టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడడం వల్ల తమ పాప కు రియాక్షన్ అయ్యి ఊపిరితిత్తులకు చర్మానికి ఇన్ఫెక్షన్ అవడం జరిగిందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మా పాపను వెంటిలేషన్ సహాయంతో హైదరాబాదులోని హైటెక్ సిటీలో ఉన్న యశోద హాస్పిటల్ లో చేర్పించామని అక్కడ ఉన్న వైద్య బృందం డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ ఎల్ సుదర్శన్ నేతృత్వంలో అరుదైన వైద్యం అందించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మా పాపను బ్రతికించిన దేవుళ్ళు యశోద హాస్పిటల్ డాక్టర్లని అన్నారు. యశోద హైటెక్ సిటీ హాస్పిటల్లో మంచి వైద్యంతో పాటు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు పేషెంట్ బంధువులకు ఎప్పటికప్పుడు వివరిస్తూ తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించడం ఇక్కడ ప్రత్యేకత అన్నారు. కార్పొరేట్ హాస్పిటల్ అని మొదట భయపడ్డప్పటికీ తక్కువ ఖర్చుతోనే మా పాపను బ్రతికించిన ఘనత యశోద హాస్పిటల్ ది అన్నారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ వైద్యులు వారితోపాటు శ్రేయ ఠాగూర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.