– బీఎల్ టీయూ ఆధ్వర్యంలో ధర్నా, వినతిపత్రం అందజేత
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం రూ.19500 కనీస వేతనం ఇవ్వాలని బీఎల్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్. సిద్దిరాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాదు నగరం లో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ బీఎల్టీయూ ఆద్వర్యంలో నిజామాబాదు మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న వాటర్ సప్లయి,గార్డెన్స్, స్ట్రీట్ ల్తెట్స్,ప్లంబర్,ఆఫీసులో పనిచేయు తదితర కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనం రూ.19500/-లు ఇవ్వాలని డిమాండ్ చేస్తు దర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో మేనేజర్ జనర్దన్ కి వినతిపత్రం అందజేశారు. అనంతరం బీఎల్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్. సిద్దిరాములు మాట్లాడుతూ..నిజామాబాదు నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం జిఓ నెంబరు 60, ప్రకారం కనీసం వేతనాలు ఇవ్వకుండా వారి ఇష్ట అనుసారం గా ఇవ్వడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా ల్లో మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ వారు జీవో నెంబర్ 60 ప్రకారం రూ.19500/-ఇచ్చినప్పుడు ఇక్కడి నిజామాబాదు నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ వారు అమలు చేయకపోవడం సిగ్గు చేటు అని అన్నారు. నిజామాబాదు పాలకవర్గం వారు ప్రజలకు పన్నులను మొపడంప్తె ఉన్న శ్రద్ధ కార్మికుల కు వేతనాలు ఇవ్వడం లేదు. 2016 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీస వేతనం రూ.26000/-ఇవ్వడం ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఇచ్చిన తీర్పు కూడా అమలు చేయడం లేదు. కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికులను పరిమినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. బహుజన లెప్ట్ మహిళ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బని లత మాట్లాడుతూ..నిజామాబాదు నగరం మున్సిపల్ కార్పొరేషన్ లో పని చేస్తున్న కార్మికులను నిజామాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ల్లో పని చేస్తున్న కార్మికుల ను తక్షణమే జిఓ నెంబరు 60 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎలాంటి పోరాటం చేయడానికి అయిన సిద్దంగా ఉండాలని మీరు చేసే పోరాటంలో బహుజన లెప్ట్ మహిళ సంఘం సంపూర్ణ మద్దతు పోరాటం ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ వర్కర్స్ &ఎప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేంద్రర్, ఉపాధ్యక్షులు గజ్జల యూదయ్య, కార్యదర్శి అయిటీ హరీష్, ఆర్, మురళి, కోశాధికారి సంపత్, బి.శంకర్, శ్రీశైలం, శంకర్, మహేందర్, నర్సిములు , రాజు, పుప్పా, రూప, గంగా తదితరులు పాల్గొన్నారు.