కార్యకర్త మృతదేహనికి నివాళులు అర్పించిన మంత్రి


— కుటుంబానికి అండదండ ఉంటామని హామీ
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్: కనగల్ మండలం బాబాసాహెబ్ గూడెం కి చెందిన నల్లగొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లబోతు సైదిరెడ్డి ప్రమాదవశత్తు కరెంటు షాక్ తో మరణించారు. ఆయన పార్తివ దేహానికి గురువారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులని కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేసి మనో ధైర్యం కల్పించారు. కుటుంబ పెద్ద కోల్పోయిన వారికి అన్నివిధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.