నవతెలంగాణ-సిటీబ్యూరో
మల్కాజిగిరి, సికింద్రాబాద్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసి యేషన్ సమావేశానికి సంబంధించి సభ్యులు క్లాసిక్ గార్డెన్స్‌లో కేంద్ర మంత్రులు ప్రల్హద్ జోషి, కిషన్‌రెడ్డిలను కలిశారు. గత 10 సంవత్సరాల నుంచి రోడ్డు ప్రారంభించలేదని సంబంధిత మంత్రికి తెలిపారు. అయితే 15 రోజుల్లో పనులు ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నర్సింగ్ రావు, కల్నల్ కష్ణ (రిటైర్డ్), (మల్కాజిగిరి కాలనీల సంక్షేమ సంఘం ప్రతిఁధి) బీబీ ధనంజయ చారి, సీనియర్ నాయకుడు, జగన్, శ్రీనివాస్, బీసీ రాష్ట్ర కార్యవర్గం, కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యులు రామకష్ణ, సుష్మిత, పరుశురాం తదితరులు పాల్గొన్నారు.