
– మద్దతు తెలిపిన సీఐటీయూ జిల్లా కోశాధికారి జి. భాస్కర్
నవతెలంగాణ -దుబ్బాక రూరల్
మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి గ్రామ పంచాయతీ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి జి. భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం దుబ్బాక మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయం ఎదుట జిపీ కార్మికులు చేస్తున్న సమ్మెకు వారు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి పని చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానం తో పాటు జీవో 51ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కార్మికుల సమస్యల పట్ల స్పందించి న్యాయం జరిగేంత వరకు తాము పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ దుబ్బాక టౌన్ కన్వీనర్ కొంపల్లి భాస్కర్, ఎండీ సాదీక్ , గ్రామ పంచాయతీ కార్మికులు ప్రశాంత్, శ్రీను, రవి, శ్రీకాంత్, దుర్గవ్వ, ఎల్లవ్వ, బాబాయి, లచ్చవ్వ తదితరులు పాల్గొన్నారు.