
హుస్నాబాద్ పట్టణంలో ఎల్లమ్మ చెరువు మత్తడి పడుతుండటంతో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న ముత్తడిని పరిశీలించారు. కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లమ్మ చెరువు నుండి మత్తడి సాగుతుంది. ఎల్లమ్మ చెరువు నీటిని చూసేందుకు కట్ట పైకి పర్యటకులు వస్తున్నారు దీంతో మున్సిపల్ చైర్మన్ ఏలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజశేఖర్, వైస్ చైర్మన్ ఐలెని అనిత రెడ్డి, కౌన్సిలర్స్ పున్న లావణ్య, చిత్తారి పద్మ తదితరులు పాల్గొన్నారు.