– పేద, మధ్యతరగతి వర్గాలకు విద్యను దూరం చేసేందుకే ఎన్‌ఈపీ
– రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మార్క శంకర్ నారాయణ
నవతెలంగాణ-హసన్ పర్తి
రాజ్యాంగ ప్రాధమిక సూత్రాలకు, ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం-2020 లోపాలపుట్ట అని రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మార్క శంకర్ నారాయణ అన్నారు. బుధవారం రోజు హన్మకొండ జిల్లా హాసన్ పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట లోని మిత్ర కన్వెన్షన్ హాల్ లో రెండవ రోజు జరుగుతున్న ఏఐఎస్‌ఎఫ్ తెలంగాణ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, సైద్ధాంతిక, శిక్షణా తరగతులకు ప్రిన్సిపాల్ గా మణికంఠ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ గా బాణోత్ రఘురాం, కాసోజు నాగజ్యోతి లు అధ్యక్షత వర్గంగా వహించగా ”జాతీయ విద్యా విధానం 2020 – దా ని ప్రభావం” అనే అంశంపై డాక్టర్ శంకర్ నారాయణ మా ట్లాడుతూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి పేద, మధ్య తరగతి వర్గాలకు విద్య ను పూర్తిగా దూరం చేసే కుట్ర జరుగుతుం దని, దానిలో భాగంగా నే జాతీయ విద్యావిధా నం-2020 పేరుతో విద్యా కార్పొరేటికరణ, విద్యాకేంద్రీకరణ, కాషాయికరణ చేయా లని కేంద్ర బిజేపీ ప్రభుత్వం చూస్తుంద ని, దేశంలో జాతీయ విద్యావిధానం వల్ల దాదాపు 90 శాతం విద్యార్థులు నాణ్యమైన విద్య పొందే హక్కును కోల్పోతారని, విద్యా వ్యాపారీకరణ వలన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ లకు, సామాజిక న్యాయం దూరం చేసే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య విద్యార్ధి కేంద్ర బిందువుగా ఉండాలికాని ఈ ఎన్‌ఈపిలో ఉపాధ్యాయుడు కేంద్ర బిందు వుగా ఉండాలని ఉందని ఇది ప్రమాదకరమని అన్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ విద్యా కేంద్రీకరణ చేస్తోందన్నారు. ప్రాచీన సనాతన భారతీయ జ్ఞాన పరంపర, ఆలోచనల మార్గదర్శనములో ఈ విద్యావిధానం ఉంటుందని చెప్పింది కాని జ్యోతిబాపూలె, సావిత్రిబాయి పూలె, సాహు మాహారాజు, డాక్టర్‌బీఆర్.అంబేడ్కర్,పెరియార్‌ల ఆలోచన లను తీసుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఈ వి ద్యా విధానం, భారత దేశ భిన్నత్వంలో ఏకత్వానికి బదులు, విద్యాకాషాయికరణకు బాటలు వేస్తుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్స్ గురించి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. సా మాజిక న్యాయం అనే మాట భూతద్దం పెట్టి వెతికినా ఎక్క డా కూడా కనపడదన్నారు. ఖాళీగా ఉన్న లక్షలాది ఉపాధ్యా య, అధ్యాపక పోస్టులు భర్తీకి ఎలాంటి భరోసా ఇవ్వలేదని తెలిపారు. ఈ విద్యా విధానంలో ప్రైవేటు విశ్వవిద్యాలయ లను, విదేశీవిశ్వవిద్యాలయాలను అనుమతిస్తారు. మండలం లో, జిల్లాల్లో ఉన్న కాలేజీల ప్రవేశాలకు దేశమంతటికి వర్తిం చేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్.టి.ఎ) ద్వారా ఒకే పరీక్ష జరుగుతుందని దీనిద్వారా స్థానికత సమస్యలు ఉత్పన్న మయ్యే ప్రమాదం ఉందని అన్నారు. నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సులో ప్రతి సంవత్సరం చదువు ఆపేసుకునే అవకాశం ఇచ్చిందని, దానిలో భాగంగా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం సర్టిఫికెట్ ఇస్తారని, దీనివల్ల అణగారిన వర్గాల విద్యార్థులు, విద్యను మధ్యలో వదిలేసే ప్రమాదం వుందని ఆవేదన వ్యక్తంచేశారు. భారత రాజ్యాంగ నేపథ్యం లోనే విద్యావిధానం రూపొందించాల్సిన అవసరం ఉందని అయన అన్నారు. అసమానతలతో నిండి యున్న భారత సమాజం పురోగమించాలంటే కామన్ పాఠ శాల విద్య ఒక్కటే పరిష్కారమన్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఈపి – 2020 పై ఆయన పాట రాసి ఆలపించిన గేయం సభికులను ఎంతగానో ఆకట్టుకుంది. అదేవిధంగా మరో టీచర్ అరుణ్ కుమార్ ”జాతీయ విద్యా విధానం 20 20 – దాని ప్రభావం” అనే అంశంపై క్లాస్ బోధిస్తూ మాట్లా డుతూ దేశంలో ఆర్థిక మిక్స్ డ్ ఎకానమీ వల్ల దేశానికి నష్టం జరిగిందని, పాలకులకు చిత్తశుద్ది లేకపోవడంతో, కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం పెరుగుతోందని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటీకరణ చేస్తున్నారని, కంపెనీలు ప్రభుత్వ పరిధిలో వుండాలని అన్నారు. విజ్ఞాన దర్శిని కన్వీనర్ రమేష్ ”వైజ్ఞానిక దక్పథం-విద్యార్థులు” అనే అంశంపై క్లాస్ బోధిస్తూ మాట్లాడుతూ మూఢ నమ్మకాలు, మూఢ విశ్వాసా లు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. విద్యార్ధులు శాస్త్రీయ దక్పథంతో ఆలోచించడం ద్వారనే మూఢ నమ్మకాలను నిర్మూలించవచ్చని అన్నారు.
ఏఐపిఎస్ ప్రచురించిన పుస్తకం ఆవిష్కరణ
ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం(ఏఐపిఎఫ్) అధ్వర్యం లో ప్రచురించిన చలసాని వాసుదేవరావు రాసిన పరిణామ వాదం పుస్తకాన్ని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షులు తక్కళపల్లి శ్రీనివాస్ రావు, డాక్టర్ శంకర్ నారాయణ, అరుణ్ కుమార్, ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు నద్దునూరి అశోక్ స్టాలిన్ లు ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర నాయకత్వంతో కలిసి అవిష్కరించారు. ఈ శిక్షణ తరగతుల్లో ఏఐఎస్‌ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు కర్రే బిక్షపతి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ ఇటికాల రామకష్ణ , రెహమాన్, సి.రాజు, ఎన్ సత్యా, ఏఐఎస్‌ఎఫ్ హన్మకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వుట్కూరి ప్రణీత్ గౌడ్, బాషబోయిన సంతోష్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్ది ప్రతినిదులు పాల్గొన్నారు.