జనగామ సమగ్రాభివృద్ధే లక్ష్యం

– ఆశీర్వదిస్తే..ఐదేళ్లు సేవకుడిగా పనిచేస్తా
– ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌ వేసిన పల్లా
నవతెలంగాణ-జనగామ
జనగామ ప్రాంత సమగ్ర అభివద్ధి లక్ష్యంగా పనిచేస్తానని బి ఆర్‌ ఎస్‌ జనగామ నియోజకవర్గ అభ్యర్థి పర్ల రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు. మంగ ళవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌ఓ కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, టిఆర్‌ఎస్‌ నాయకులు మండల శ్రీరాములు, జల్లి సిద్ధయ్యలతో కలిసి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.ఈసందర్భంగా నియోజకవర్గం లో పలు గ్రామాల నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు వేలాది మంది తరలివచ్చారు. మహిళలు మంగళహారతులు, బోనాలు, బతుక మ్మలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం నుంచి ఆర్‌అండ్‌బి గెస్ట్‌ హౌస్‌, నెహ్రూ పార్క్‌ ఆర్టీసీ చౌరస్తా మీదుగా ఆర్వో(ఆరీవో) కార్యాలయం వరకు యువత యువతతో భార్య ర్యాలీగా తరలివచ్చారు. నామినేషన్‌ దాఖలు చేసిన అ నంతరం పల్లా రాజేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. జనగామ నియో జకవర్గాన్ని మరింత అభివద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే ఐదేళ్లు సేవకుడిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆ శీస్సులతో జనగామ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశానన్నారు. నియోజకవర్గ పెద్దలు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు ముతి ్తరెడ్డి యాదగిరి రెడ్డి, డాక్టర్‌ తాటికొండ రాజయ్య, బోడకుంటి వెంకటేశ్వర్లు, మండల శ్రీరాములు, సిద్ధిరాములు, పోకల జమున, టౌన్‌ అధ్యక్షుడు సురేష్‌ నాయకత్వంలో
రెండు సెట్ల నామినేషన్‌ దాఖలు చేశానని పేర్కొన్నారు. జనగామ సమగ్రాభివృద్ధి కోసం ప్రజలంతా బీఆర్‌ఎస్‌ అభ్య ర్థులను ఎన్నుకోవాలని కోరారు. జనగామ నియోజకవర్గం ఇప్పటికే చాలా అభివృద్ధి చెందిందని, ఇంకా చెందాల్సి ఉం దని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారం, నియోజకవర్గ పెద్దల సలహాలు, సూచనలతో అభివృద్ధిని వేగవంతం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ప్రజల సంపూర్ణ సహకారంతో జన గామ ఎమ్మెల్యేగా తప్పకుండా గెలుపొందుతానన్న విశ్వాసం తనకు ఉందన్నారు. నియోజవర్గ అందరి పెద్దల సహకా రంతో ఎన్నికల రణరంగంలో దిగుతానని, ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులుగా ఉన్న వారి సలహాలు, సూచలను పాటిస్తూ జనగామపై బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తానని స్పష్టం చేశారు. ప్రత్యేక ప్రణాళికతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రజాప్రతినిధుల సహకారంతో నియోజవర్గ సమగ్రాభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు.