బీఆర్ఎస్ లో కొనసాగుతున్న వలసల పర్వం

– అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులవుతున్న వివిద పార్టీల నాయకులు

– రోజు రోజుకి పెరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ బలగం
– బీఆర్ఎస్ పార్టీ లో పార్టీ లో చేరిన 13,27,28,29  52వ డివిజన్ లకు చెందిన 500 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు
నవతెలంగాణ- కంటేశ్వర్: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల  సమక్షం లో వివిధ పార్టీలకు చెందిన 500 మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే వియ్యాల గణేష్ గుప్తా మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరంలో అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రోజురోజుకీ నిజాంబాద్ లో తమ పార్టీ బలగం పెరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్  దండు నీతు కిరణ్, బీఆర్ఎస్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్, దండు శేఖర్, నవీద్ ఇక్బల్, అక్బర్ హుస్సేన్, రాజేంద్ర ప్రసాద్, సిర్ప రాజు తదితరులు పాల్గొన్నారు.