ప్రతిపక్ష పార్టీలకు స్థానం లేకుండా చేయాలి..!

– ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌
నవతెలంగాణ-మరిపెడ
డోర్నకల్‌ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీల కు స్థానం లేకుండా చేయాలని బిఆర్‌ఎస్‌ చేతిలో వారీకి మరో సారి చావు దెబ్బ తప్పదని డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయాక్‌ అన్నారు. గురువారం మ రిపెడ మండల కేంద్రంలోని స్థానిక నవీన్‌ రావు గె స్ట్‌ హౌస్‌లో డోర్నకల్‌ నియోజకవర్గం కార్యకర్తల స మావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ నేను ఒక సారి చెప్తే వందసార్లు చెప్పినట్టుగా కార్యకర్తలు నా పై నమ్మకంతో పనిచేయడం నా అదృష్టమన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన ప్రతిపక్ష పార్టీలకు అభ్యర్థులను ప్రకటించడానికి ధైర్యం చాలటంలేద ని ఆరోపించారు. బిఆర్‌ఎస్‌ మూడోసారి అధికా రంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశా రు. కార్యకర్తలు వర్గ విభేదాలు పక్కనబెట్టి ఐక్యమ త్యంతో పని చేయాలని. ఎన్నికల్లో గెలిచినంక అం దరికీ అన్ని విధాలుగా పదవులు వచ్చే విధంగా సీ ఎం కేసీఆర్‌ చూసుకుంటారన్నారు. ఈ సమావేశం లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గుడిపూడి న వీన్‌ రావు, ఎంపీపీ గూగులోత్‌ అరుణ రాంబాబు, జెడ్పిటిసి శారద రవీందర్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సింధూర, వైస్‌ ఎంపీపీ గాదే అశోక్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ యువ నేత డీఎస్‌ రవిచంద్ర, నాయకులు కొంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.