నవతెలంగాణ – రాజంపేట్
మండలంలోని అరేపల్లి పంచాయతీ పాలక వర్గం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా అరేపల్లి గ్రామ పాలక వర్గాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతి కార్యదర్శి ప్రశాంత్ సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత ఐదు సంవత్సరాలుగా గ్రామ అభివృద్ది కోసం కృషి చేసిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.