సింధూ ప్రజలకు ఏ పంట గురించి తెలియదు?

Which crop was unknown to the people of Indus?1. హరప్పా వాసుల ఎత్తు
– 5.8 అడుగులు
2. హరప్పా వాసులు ఏజాతికి చెందినవారు
– కాకసాయిడ్స్‌
3. హరప్పా వాసులు ఏ లోహం నువాడలేదు – ఇనుము
4. కోట లేదా రక్షణ ప్రహరీ లేని ఏకైక పట్టణం – చాన్హూదారో
5. మోహంజదారోలో గోప్ప స్నాన వాటికను కనుగొన్నది – మార్టిమర్‌ వీలర్‌
6. హరప్పా నాగరికతతో పెద్ద పట్టణం – రాఖీ గరీ
7. హరప్పా ప్రదేశాలు ఎక్కువగా వున్న రాష్ట్రం – గుజరాత్‌
8. కాలిబంగన్‌లో ఏమి లభించాయి
– దున్నిన పొలము, చెక్క, నాగలి, ఒంటె ఎముకలు.
9. అనగా గుజరాతిలో మృతుల దిబ్బ
– మోహంజోదారో అనగా సింధిలో మృతుల దిబ్బ
10. ఆధునిక చెస్‌ బోర్డును పోలిన ఆటవస్తువు లభించిన ప్రాంతం – లోధల్‌
11. త్రాసు లభించిన ప్రాంతం – లోధల్‌
12. హరప్పా లిపిలో గుర్తులు – 1400
13. సిందు నాగరికతను మొదట క్రీ||శ|| 1826లో పేర్కొనది
– చార్లెస్‌ మాజిన్‌
14. వాయువ్య భారతదేశంలో రైల్వేలైన్లు వేస్తున్నప్పుడు 1920లో సింధునాగరీకత బయట పడింది (కనుగొన్న వారు – దయరాం సహని)
15. సింధు నాగరీకతలో అతి పురాతన ప్రదేశం
– (రాఖి గరి)
16. సింధు నాగరికతలో ప్రధాన రేవు పట్టణం – లోధల్‌ (సూర్కటాడ, దోలవీర కూడ ముఖ్య రేవు పట్టణాలే)
17. సూర్కటాడ ఎక్కడవుంది
– గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో రాపూర్‌లో
18. సింధూ నాగరీకత పితామహుడు – జాన్‌ మార్షల్‌
19. సింధూ ప్రజల దైవం పశుపతి చుట్టు వుండే జంతువులు
– ఏనుగు, పులి, ఒక వైపు నీటి గేదె, ఖడ్గమృగం ఒకవైపు
20. హరప్పాలో లభ్యమయిన అతి పెద్ద నిర్మాణం – దాన్యాగారం.
21. పశుపతి ముద్ర లభ్యమయిన ప్రాంతం – మొహంజోదారో
22. సింధు ప్రజలు మొదట మచ్చిక చేసుకొన్న జంతువు – గొర్రె
23. సూర్కటాడను కనుగొన్నవారు
– జీaస్త్రa్‌ జూaసఱ జీశీరష్ట్రఱ
24. మోహంజోదారోలో లభ్యమయిన నర్తకి కాంస్య విగ్రహం కొలతలు
– 10.5జవీ ఎత్తు 5జవీ వెడల్పు
25. గుర్రం ఎముకలు, పళ్ళు లభ్యమయిన ప్రాంతం
– సూర్కటాడ.
26. మోహంజదారోలో లభ్యమయిన అస్థిపంజరాలు – 37 (అందుకే మోహంజదారోను మృతుల దిబ్బ అని పిలుస్తారు)
27. సింధూ ప్రజలు పవిత్రంగా పూజించిన చెట్టు – రావి చెట్టు
28. సింధూ నాగరీకతకు హరప్పా నాగరికత అని నామకరణ చేసింది – సర్‌ జాన్‌ మార్షల్‌
29. సింధూ ప్రజలు వ్యవసాయం – అక్టోబర్‌ – ఏప్రిల్‌లో చేసేవారు (ఈశాన్య ఋతుపవనాల కాలం)
30. సింధూ ప్రజల ప్రధాన పంట – బార్లీ
31. వరి పండించిన ఆనవాళ్లు
– రంగాపూర్‌, లోధాల్‌లో లభించాయి.
32. సింధు ప్రజలు వస్తువులను నౌకల ద్వారా ఎథెన్‌ నుంచి దిల్మన్‌ (బహ్రెయిన్‌), మక్రాన్‌ (సౌది అరేబియా పట్టణం) కు సరుకులు రవాణా చేసి వర్తకం చేసేవారు.
33. సింధు ప్రజలు ముద్రికలును స్టియోలైట్‌ రాయితో చేసేవారు.
34. అగ్ని ప్రమాదం కారణంగా నశించిపోయిందని భావి స్తున్న సింధు నాగరికత పట్టణం
– కోట్‌డిజి (పాక్‌లో సింధు రాష్ట్రం)
35. సంధూ ప్రజలు ఎక్కువగా వాడిన లోహం – రాగి
36. హరప్పా పట్టణం రావి నది ఒడ్డున వుంది.
37. మొహంజోదారో సింధు నది ఒడ్డున వుంది.
38. 1000 యజ్ఞాలు జరిగిన ప్రదేశంగా పెర్కొన్న పట్టణం – హరప్పా
39. వైశాల్యం, జనాభా దృష్ట్యా పెద్ద పట్టణం
– మొహంజోదారో
40. గణిత శాస్త్ర చిహ్నలు కల నాగరీకత
– సింధూ నాగరకత
41. హరప్పా శిల్ప నైపుణ్యం దోలవీరలో ఎక్కువగా కన్పించింది
42. బన్వాలిను 1974లో సరస్వతి నది ఒడ్డున బిస్ట్‌ కనుగొన్నారు.
43. హరప్పా వాసులు పట్టణాల నిర్మాణం గ్రిడ్‌ పద్దతిలో వుంది.
44. సుమెరియన్‌ గ్రంథాలు సింధూ ప్రాంతాన్ని మెలూహ అని వర్ణించబడింది.
45. సింధూ ప్రజలు ఉపయోగించిన రాగి ఖనిజాన్ని ఖేత్రి (రాజస్థాన్‌), నుంచి పొందేవారు.
46. ప్రపంచంలో మొదటిసారిగా వెండి బయటపడిన దేశం – ఇండియా
47. ”మొహంజదారో అండ్‌ ది ఇండస్‌ సివిలైజేషన్‌” అనే పుస్తక రచయిత
– సర్‌. జాన్‌ మార్షల్‌
48. The Indian Civilization Book” రచయిత
– మార్టిమర్‌ వీలర్‌
49. సతి సహగమన ఆచారం లోధాల్‌లో బయటపడింది.
50. టెర్రకోట బొమ్మలపై ఆవు బొమ్మను ముద్రించబడలేదు.
51. సింధూ ప్రజల వస్త్రాల మూట దొరికిన ప్రాంతం
– ఉమ్మా (మెసపటోమియా నగరం)
51. పంచతంత్రంలోని నక్క కథలాంటి దాన్ని చెక్కిన జార్‌ లభ్యమయిన ప్రాంతం – లోధాల్‌, కాలిబంగన్‌
52. హరప్పాలో లభించిన ఎరుపు రాయితో చెక్కబడిన పురుషుని విగ్రహం యక్షుడుదిగా భావిస్తారు.
53. కాలిన వస్త్ర పీలిక లభించిన ప్రాంతం – మొహంజోరో
54. నివాస గృహాల చుట్టూ ప్రహరీలు నిర్మించిన ప్రాంతాలు
– లోధాల్‌, కాలి బంగన్‌
55. సింధూ ప్రజలకు ఏ పంట గురించి తెలియదు – చెరకు
56. సింధు ముద్రలపై ఎక్కువగా కనిపించిన జంతువు, చెట్లు
– వృషభం, రావి, వేప
57. సిరాబుడ్డి దొరికిన ప్రాంతం – చాన్హూదారో
58. వ్యవసాయం కోసం నీటిని నిలువ చేసే నిర్మాణాలు
– గబర్‌ బంద్‌ (డామ్‌)
58. మిని హరప్పా, మిని మొహంజదారో అని దేనిని పిలుస్తారు – లోధాల్‌
59. సింధూ నాగరీకత రహదారులు అన్ని గ్రిడ్‌ విధానంలో గా వుంటే ఒక్క ప్రాంతంలో మాత్రం అస్తవ్యస్తంగా రహదారులు వుంటాయి – బనవాలి
60. పులి బొమ్మ వున్న ముద్ర లభించిన ప్రాంతం – బనవాలి
– కె. నాగార్జున
కరెంట్‌ ఎఫైర్స్‌ సీనియర్‌ ఫ్యాకల్టీ
9490352545