నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కేమ్రాజ్ కల్లాలి లో గ్రామ సర్పంచ్ రమేష్ రావ్ దేశాయి పార్టీలకు అతీతంగా నిర్వహించి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్నేళనంకు వివిధ గ్రామాల నుండి భారీగా తరలి వచ్చారు. ఈ సంధర్భంగా కేమ్రాజ్ కల్లాలీ సర్పంచ్ రమేష్ దేశాయి మాట్లాడుతు మండలంలోని గ్రామాల వారిగా కార్యకర్తలు సమస్యలను వివరించారని. గ్రామాలలో జర్గిన ఆభివృద్ది పనులను చర్చించినారని. అదేవిధంగా గ్రామాల వారిగా ఆభివృద్ది నోచుకుని సమస్యలు ఉన్న వాటిని పరిష్కార మార్గాలను ఒకరికోకరు తెలుసుకుని పరిష్కరించుకుందామని అన్నారు. కేమ్రాజ్ కల్లాలీ నాలుగు పర్యాయాలు ఉత్తమపంచాయతి ఆవార్డు తో ఒకసారీ జాతీయ ఆవార్డు కూడా అందుకోవడం జర్గిందని పేర్కోన్నారు. అదేవిధంగా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు పోడుభూములు సమస్య తీరలేదని, కొంతమందికి పట్టాలిచ్చారు చాల మందికి పోడురైతులకు మరిచిపోయారు. తమసమస్యలను తామే పరిష్కరించుకోవాలని , తమకున్న జిల్లా ఉన్నత అధికారుల పరిచయాలతో వారి కృషితో సహకారంతో గ్రామాభివృద్ది చేసుకోవడం జర్గిందని అన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జుక్కల్ కొత్త మండలం ఏర్పాటు చేయాలని, బిచ్కుందను డివిజన్ కేంద్రం చేయాలని అందరం కలిసి పోరాటం చేసి సాదీంచుకుందామని తెలిపారు. అదేవిధంగా వరికోనుగోలు కేంద్రాలలో కట్టిల పేరుతో దోపిడి చేస్తున్నారు, రాబోయే రోజులలో సమస్యలను పరిష్కరిస్తేనే ఎవరు రైతులకు నమ్మకం కల్గించిన వారికి మద్దతు చేద్దామని పేర్కోన్నారు. కార్య క్రమంలో కేమ్రాజ్ కల్లాలీ సర్పంచ్ రమేష్ రావ్ దేశాయి, వివిధ గ్రామాల పార్టీలకు అతిీతంగా వచ్చిన సర్పంచులు, వక్తలు, యూత్ సంఘం యువకులు , రైతులు, కార్మీకులు తదితరులు పాల్గోన్నారు.