
సోమవారం రోజున మోపాల్ మండలంలోని
సిర్పూర్, న్యాల్ కల్ , ముదక్ పల్లి, శ్రీరామ్ తండా గ్రామాలలో జన సంద్రోహం మధ్య బీజేపీ రూరల్ అభ్యర్థి దినేష్ కులాచారి యొక్క ప్రచారానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళాలలు, యువకులు పెద్ద ఎత్తిన తరలివస్తు జై బీజేపీ జై దినేష్ అన్నాా అని నినాదాలతో అక్కడ ప్రాంగణం మొత్తం మారుమోగింది.ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గా బీజేపీ అభ్యర్థి దినేష్ కులాచారి మాట్లాడుతూ గత ఎన్నికల్లో బాజిరెడ్డి గోవర్ధన్ కి ఈ గ్రామల ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపడం జరిగింది.కానీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బంది పెట్టాడు.తన ఆస్తులు మాత్రమే పెంచుకున్నాడు. కానీ ప్రజల అభివృద్ధి కోసం, ప్రజలు పడుతున్న బాధలు, మరియు వారి కష్టాలను మాత్రం తెలుసుకోలేకపోయారు.కావున వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి బడుగు బలహీన వర్గాల నిరుపేద కుటుంబాలకు చెందిన వ్యక్తిని నన్ను ఆశీర్వదించండి తప్పకుండా మీ గ్రామాలను అన్ని విధాల ఆదుకుంటానని తెలపడం జరిగింది. అలాగే లక్ష ఎకరాలకు నీరందిస్తానని చెప్పి మాట తప్పడు లక్ష ఎకరాలకు నీరు ఇవ్వకుంటే ఆరు నెలల్లో తన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తా అని తొమ్మిది సంవత్సరాలు అధికారం అనుభవించి ఒక్క గుంటకు కూడా సాగునీరు అందించలేడు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని మాట తప్పిన ప్రభుత్వం ఈ దౌర్భాగ్య ప్రభుత్వమని కనీసం ఒక జాబును కూడా సరిగా వేయలేకపోయారని ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలే తప్ప అభివృద్ధి కనబడడం లేదని ఇక్కడ రోడ్లు చూస్తే గుండె తరుక్కుపోతుందని , ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. కావున బాజిరెడ్డి గోవర్ధన్ తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికైనా ప్రజల ఆలోచించాలని మీకు వచ్చే బియ్యం కూడా మోడీ ప్రభుత్వం ఇస్తుందే తప్ప రాష్ట్ర ప్రభుత్వం కాదని, అలాగే కరోనా సమయంలో ప్రపంచం మొత్తం విలవిలలాడుతుంటే మన దేశానికి మాత్రం కరోనా వ్యాక్సిన్ రూపంలో ప్రాణాలు కాపాడిన వ్యక్తి మోడీ అని మన రాష్ట్రంలో బిజెపి జెండా ఎగరవేసి మోడీకి కానుకగా ఇవ్వాలని, అవినీతికి ఆమడ దూరంలో ఉండే పార్టీ బిజెపి పార్టీ అని దాదాపు పది సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా ఇక్కడ కూడా అవినీతి జరగలేదని కానీ ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో స్కీములు లే స్కాములై ప్రజలు నిలువు దోపిడీ చేశారని, తమది కుటుంబ పాలన కాదని సామాన్య మానవుడు కూడా ఎమ్మెల్యే ఎంపీ అయిన పార్టీ బిజెపి పార్టీ అని ఆయన కొనియాడారు. అలాగే మంచిప్ప ప్రాజెక్టు విషయంలో ప్రజలను మోసం చేస్తున్నారని కేవలం వల్ల ధనార్ధన కోసమే ప్రాజెక్టు రీ డిజైన్ చేపట్టారని తమ ప్రభుత్వం రాగానే దీని రద్దు చేస్తామని ఆయన కొనియాడారు ఈ ఎన్నికల్లో బిజెపి పార్టీ కి సంపూర్ణ మద్దతు తెలిపి కమలం పువ్వు మీద ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మహిళలను యువకులను రైతన్నలను గ్రామస్తులను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వర్ పద్మా రెడ్డి గారు మండల అధ్యక్షుడు రవి, బీజేవైఎం రూరల్ కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి , అంచ మహేందర్ రెడ్డి, పృథ్వి, శ్రీనివాస్ యాదవ్, కుచన్ పల్లీ శ్రీనివాస్ రెడ్డి, మోపాల్ మండల శాఖ నాయకులు, కార్యకర్తలు మహిళలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు