కామారెడ్డికి చెందిన మహమ్మద్ బహదూర్ ఖాన్ అలియాస్ బాబా భార్య తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన విరాళ ప్రకారం కామారెడ్డి విద్యానగర్ కాలనీలో నివాసముండే మహమ్మద్ బహుదూర్ ఖాన్ అలియాస్ బాబా, వయసు 50 సంవత్సరాలు, డ్రైవరుగా విధులు నిర్వహించే ఈ వ్యక్తి తేదీ 19-9-2024 నాడు డ్రైవింగ్ పనికి వెళ్లి, సోమవారం వరకు ఇంటికి రాకపోయేసరికి ఆమె భార్య అయిన నూర్జహాన్ అతని ఫోన్ నెంబర్ కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో సోమవారం పోలీస్ స్టేషన్కు వచ్చి అతని ఆచూకీ గురించి దరఖాస్తు ఇవ్వడం జరిగిందనీ, ఇతని గురించి తెలిసిన వారు ఎవరైనా పోలీస్ స్టేషన్ కామారెడ్డి టౌన్ లో తెలపాలన్నారు. లేదాకామారెడ్డి పట్టణ సీఐ ఫోన్ నెంబర్లు: 8712686145, 8712666242 ఈ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు.