గత ప్రభుత్వాలు నియోజకవర్గానికి అభివృద్ధి శూన్యం

– ఒడిస్సా ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు 
నవతెలంగాణ-గోవిందరావుపేట
బీఆర్ఎస్, కాంగ్రెస్  ప్రభుత్వాలు ములుగు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యం అని ఒడిస్సా ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు మదిని తేజ రాజు ఆధ్వర్యంలో  మండల పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఒడిస్సా ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు హాజరై మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో అధిక మెజారిటీతో బిజెపి ఉండాలని మండల ముఖ్య కార్యకర్తలకు జిల్లా పద్ధతికారులకు సూచించారు .అదేవిధంగా బిఆర్ ఎస్ పార్టీ నిన్న జరిగిన అసెంబ్లీ వారీగా పోటీ చేసే అభ్యర్థులను రిలీజ్ చేయడం జరిగింది ఈ పోటీ చేసిన అభ్యర్థులలో సగానికి సగం మంది అవినీతి అక్రమాలకు పాల్పడినవారు  పోటీ చేస్తున్నారని అన్నారు. అక్రమాలకు అవినీతికి నిలువెత్తు నిదర్శనం అంటే అది బిఆర్ఎస్ పార్టీ  అని అన్నారు. దేశంలో నరేంద్ర మోడీ  ప్రభుత్వం సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ప్రతి గ్రామపంచాయతీలకు 90% నిధులు నరేంద్ర మోడీ  ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఇస్తుందని అన్నారు .ములుగు జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీలో కూడా ఈరోజు ఐటిడిలో చూసుకున్నట్లయితే కోట్లాది రూపాయల కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఆదివాసులకు అందుతున్నాయి అని అన్నారు. ములుగు అసెంబ్లీలో అభివృద్ధి కుంటిపడిందని అన్నారు .ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి అనసూయ రాష్ట్ర ప్రభుత్వం నుండి గాని కేంద్ర ప్రభుత్వం నుండి గాని ఏ ఒక్క రూపాయి నిధులు కూడా తీసుకొచ్చిన ఘనత లేదని అన్నారు. చెరువులో తెగిపోతే ,మోరీలు కూలిపోతే ప్రాజెక్టులు విరిగిపడితే ఫోటోలకే ఫోజులు ఇచ్చి అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉందని ప్రస్తుత  ఎమ్మెల్యే గారిని విమర్శించారు .రోడ్లు వేయని రహదారులలో రాష్ట్ర ప్రభుత్వం గల్ల పట్టి అడిగి రోడ్లు వేసే దిశగా ప్రయాణించాలని అన్నారు. అంతేగాని రోడ్లు చెడిపోయిన వాటికి ఫోటోలకు ఫోజులిస్తే అభివృద్ధి కాదు అని అన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోనూ ములుగు అసెంబ్లీలోను లేకపోయినా గ్రామాలకు గ్రామ పంచాయతీలకు ప్రతి  రూపాయి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే అభివృద్ధిలో శూన్యంగా అడుగులు వేస్తుందన్నారు ఆదివాసి ఆడబిడ్డ అని గెలిపిస్తే ఇటు ఆదివాసులకు గాని గిరిజనేతరులకు  గాని ఈమె చేసిందే ఏమీ లేదు అని అన్నారు. ములుగు ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని అన్నారు .టిఆర్ఎస్ ప్రభుత్వం  ఎన్నికలలో మేనిఫెస్టోల లో పెట్టిన  హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు రాబోయే రోజులలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని అన్నారు .అదేవిధంగా ములుగు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ చాపకింద నీరు లాగా దూసుకెళ్లింది అని అన్నారు. ఆదివాసులకు  భారతీయ జనతా పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఆలోచన ప్రజలలో ఉందని అన్నారు .భారతీయ జనతా పార్టీ ములుగు నియోజకవర్గంలో గెలిచే విధంగా ప్రతి ఒక్కరు కార్యకర్తలు ఆధాధికారులు పనిచేసి సమయానికి కేటాయిస్తే ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలో కాశాయపు జెండా ఎగరవేయడమే ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పాలసీ & రీసెర్చ్ ఇంచార్జ్ భూక్య రాజు నాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అజ్మీర కృష్ణవేణి నాయక్, పార్లమెంట్ కో కన్వీనర్ తక్కలపల్లి దేవేందర్ రావు, అసెంబ్లీ కన్వీనర్  సిరికొండ బలరాం,జిల్లా ఉపాధ్యక్షులు ఏనుగు రవీందర్ రెడ్డి, జవహర్,జిల్లా కార్యదర్శికర్ర సాంబశివుడు,మహిళా మోర్చాజిల్లా అధ్యక్షురాలు చంద్రజ్యోతి,జిల్లా కార్యదర్శులు  స్వప్న, ఓం రా,మండల అధ్యక్షురాలు అంతిరెడ్డి రమాదేవి,  జిల్లా ప్రచార కార్యదర్శి రుద్రారపు సురేష్, రమేష్, మహేందర్ రెడ్డి, కొత్త సుధాకర్ రెడ్డి, నాగేశ్వరరావు, చంటి, శ్రీకాంత్, సామల శీను,మూల కుమార్,  శక్తి కేంద్రాలు ఇన్చార్జులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.