
నవతెలంగాణ-శంకరపట్నం
మండల కేంద్రంలో సోమవారం నాటికి టమాటో ధరలు విపరీతంగా పెరిగాయి దీంతో కొనుగోలుదారులు లబో దిబో మంటూ మండిపడుతున్నారు. సోమవారం వారసంతలొ టమాటా ధర కొండెక్కి కూసున్న దళారులు అమ్ముతున్నారు.దీంతో వినియోగదారులు ఏం చేయాలో దిక్కు దోచోని పరిస్థితిలో ఉన్నారు,అమ్మకం దారులు టమాటోను బస్సు చార్జీ, ఆటో చార్జీలు విపరీతంగా పెట్టుకొని కొనుగోలు చేస్తున్నామని దీంతో టమాటా ధర 200కు పెంచవలసి వస్తుందని అమ్మకం దారులు వివరించారు, టమోటా కొనేవారు లబొ,దిబో,మంటూ టమోటా ను కొనుగోలు చేస్తున్నారు, మరోవైపు టమోటా ధర పెరగడంతో తక్కువ ధరలో దొరికే కూరగాయలను వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు ,ఏది ఏమనప్పటికీ టమాట ధరలు పెరగడం చర్చనీయంగా మారిందని అంటున్నారు.