కౌలుదార్ల సమస్యలను పరిష్కరించాలి

– అకాల వర్షాలకు పంట నష్టపరిహారం అందించాలి : సీఎం కేసీఆర్‌కు కూనంనేని లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో కౌలుదార్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వా న్ని డిమాండ్‌ చేశారు. అకాల వర్షాలకు పాడైపోయిన పంటలకు నష్టపరి హారం వెంటనే అందించాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్ర శేఖరరావుకు గురువారం ఆయన లేఖ రాశారు. ధాన్యం సేకరణలో మిల్లర్ల దోపిడిని అరికట్టాలని తెలిపారు. వర్షం లో దెబ్బతిన్న ధాన్యంలో తాలు, నూక ల పేరుతో క్వింటాల్‌ వరి ధాన్యానికి 10 నుండి 15 కిలోలు మిల్లర్లు కోత పెడుతున్నారని వివరించారు. దాని పైన ప్రభుత్వం శ్రద్ధ వహించాలని కోరారు. మార్చిలో కురిసిన వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం ఎకరాకు రూ.10 వేలు ఇస్తామంటూ ప్రకటించారని గుర్తు చేశారు. అందులో కౌలు రైతులకు కూడా ఇచ్చేందుకు డబ్బులు విడుదల చేశారని, కానీ ఇప్పటికీ రైతుల ఖాతా ల్లో అవి జమ కాలేదని తెలిపారు. ఏప్రిల్‌, మేలో కురిసిన అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పంటల సర్వే ప్రక్రియ ఇప్పటికీ మొదలు కాలేదని పేర్కొన్నారు. వెంటనే ఆ ప్రక్రి యను పూర్తిచేసి నష్టపోయిన పంట లకు గతంలో ప్రకటించిన విధంగా పరిహారం అందించాలని కోరారు. మా ర్క్‌ఫెడ్‌కు కౌలుదార్లు అమ్మిన మక్క జొన్నల డబ్బులు పట్టేదారు పేరు మీద వేస్తున్నారని, కౌలుదార్లు, రైతుల ఖా తాల్లో జమ చేయాలని తెలిపారు. కొ నుగోలు కేంద్రాల్లో తేమ శాతాన్ని చూసే యంత్రాలను, మిల్లర్లు ఉప యోగించే తేమ యంత్రాలతో సహా అన్నింటినీ విజిలెన్స్‌ అధికారులతో పరిశీలించాలని సూచించారు.