ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

నవతెలంగాణ చండూరు: రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. మంగళవారం చండూరు మండల కేంద్రంలో ఆ పార్టీ చండూరు మండల కమిటీ సమావేశం సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను తొలి సంతకం తోనే అమలు చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం హయాంలోఎన్నికల ముందు ఇచ్చిన హామీలనుఅమలు చేయకపోవడం వలనప్రజలు బిఆర్ఎస్ ను ఇంటికి సాగనంపడం జరిగిందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాలని అన్నారు. మునుగోడు ప్రాంత సమస్యలపై పోరాటం చేసేది కమ్యూనిస్టులేనని అన్నారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సురక్షితమైన పనులను అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో  ఆ పార్టీ మండల కార్యదర్శి మోగుదాల వెంకటేశం, మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, కె.నరసింహ, కంచర్ల రవి తదితరులు పాల్గొన్నారు.