వేసవి సెలవుల్లోనే పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలి

– ఎంఎస్పీ , ఎమ్మార్పీఎస్‌
నవతెలంగాణ – ములుగు
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్దత సాధన కోసం జూన్‌ 3 నుండి 12 వ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో మహాసభలు నిర్వహిస్తున్నామని , మాదిగ ప్రజలంతా పెద్ద ఎత్తున ఈ మహాసభల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఎంఎస్పి ఉమ్మడి జిల్లా ఇంఛార్జి మంద కుమార్‌, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్రి సతీష్‌ పిలుపునిచ్చారు.ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలో రిటైర్డ్‌ ఉద్యోగస్తుల భవనంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా మహాసభలకు సంబందించిన కరపత్రాలు ఆవిష్క రించి వారు మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్ట బద్దత సాధన ఉద్యమం కీలక దశకు చేరుకుందని అన్నారు. కొన్ని రోజులుగా ఎస్సీ వర్గీకరణను నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన బీజేపీ కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేస్తూ తీర్మానం చేయడం, కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్‌ షా ఎస్సీ వర్గీకరణ చట్టబద్దత పట్ల సాను కూల ప్రకటన చేయడం శుభపరిణామం అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచర ణలోకి వచ్చి రూట్‌ మ్యాప్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం దేశంలో ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడానికి అను కూలమైన వాతావరణం ఉందని , ఈ సమయంలో మాదిగ ప్రజలంతా ఏకమై ఉద్యమాన్ని ఉదతం చేద్దామని అన్నారు. ఊరూరా మాదిగ ప్రజలను కదలించడానికి ఉమ్మడి జిల్లా మహాసభలను నిర్వహిస్తున్నామని అన్నారు. జూన్‌ 4 వ తేదీన ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ ఆడిటోరియం ప్రాంగణంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా బహిరంగ సభను నిర్వహిస్తు న్నామని అన్నారు. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పాల్గొంటారని, విజయవంతం చేయాలని, ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామం నుండి మాదిగ, ఉప కులాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి ఇరుగుపైడి, మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు నెమలి నరసయ్య మాదిగ, నియోజకవర్గ ఇన్చార్జి వావిలాల స్వామి, జిల్లా సీనియర్‌ నాయకులు మడిపల్లి శ్యాంబాబు మాదిగ, మహాజన సోషలిస్ట్‌ పార్టీ ములుగు పట్టణ అధ్యక్షుడు మరాఠీ రవీందర్‌ మాదిగ పాల్గొన్నారు.