ప్రశ్న

ప్రశ్నమొన్నటికి మొన్న ప్రజాస్వామ్య వేదికయిన పార్లమెంటులో ప్రశ్న లేవనెత్తినందుకు మహువా మొయిత్రాను, కనీసం ఆమె మాట్లాడటానికి అవకాశం కూడా ఇవ్వకుండా బహిష్కరించి బయటికి పంపారు. కానీ అదే సందర్భంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌ మాత్రం దర్జాగా సభలో కూర్చునే ఉన్నారు, అంతకుముందు, అదానీ అక్రమాల, ఆదాయాల గురించి అడుగుతున్నారనే రాహుల్‌గాంధీని బహిష్కరించారు. ఇప్పుడు తాము ఇష్టంగా కట్టించుకున్న పార్లమెంటు కొత్త భవనంలోకి, బీజేపీ ఎంపీ సహకారంతో సభలోకి వచ్చిన వారు పొగబాంబులతో భయాందోళన కలుగజేస్తే వివరణ ఇయ్యమన్నారు అంతే! ఎందుకిలా జరిగిందో బాధ్యులు మాట్లాడాలి అని అడిగారు తోటి పార్ల మెంటు సభ్యులు. ఏం నేరం చేశారు? వారందరినీ దారుణంగా సభ నుంచి బహిష్కరించారు. నేరమేమంటే వారిని ప్రశ్నించటమే.
అడుగు, అడుగుతూనే ఉండు. వాళ్లు సమాధానం చెప్పినా, చెప్పకపోయినా అడగటం మానే యవద్దు. ఎందుకంటే అడగటంలోనే అడుగు ముందుకేయగలం. అడుగు అడుగు కొనసాగితేనే జీవన పయనం ముందుకుపోతుంది. అడగటాన్నే అడ్డుకుంటే అజ్ఞానాంధకారం అలుముకునే వుం టుంది. అప్పుడు నిలచివున్న నీటివోలె మురికి ముసురుకుంటుంది. పాకే నదిలాంటిదే మనిషి చైత న్యమైనా, జ్ఞానమైనా! ఎన్నిమార్లు చెప్పుకోలేదు, ప్రశ్ననే మనల్ని ఇంతదూరం తీసుకువచ్చిందని. ఇం త ప్రగతిని సాధించిందని. మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవటమంటే, మన బుద్ధి మందగించిందనే కదా!
ప్రశ్నోపనిషత్తు అనేది ఉపనిషత్తులలో నాలుగవది. వేదాల సారాన్ని ప్రశ్నల రూపంలోనే వేసి వివరించారు ఆనాడు. ఉపనిషత్తు కాలంలో ప్రశ్నకు అంతటి ప్రాధాన్యం వుంది. ఆ మధనంలోంచే వేదాంతం ఉద్భవించింది. ప్రశ్నంటే అడగటం ఉంటుంది. ప్రశ్నలో జిజ్ఞాసుంటుంది. అవేదన ఉం టుంది. ప్రశ్న సృజనాత్మకతను జాగృతం చేస్తుంది. విమర్శనా శక్తిని ప్రసాదిస్తుంది. జ్ఞానాన్ని జీవి తానికి అన్వయిస్తూ ముందడుగు వేస్తుంది. చుట్టూ వున్న జీవకోటితో తన సంబంధాలను ప్రశ్నించుకున్న విధానం సమాజ ఆవిష్కరణకు మూలమయింది. ఉన్న స్థితి నుండి ఉన్నతి స్థితికి చేరుకోవాలనే ఆరాటంలో వెలువడ్డ ప్రశ్న శాస్త్ర సాంకేతిక ప్రగతికి మార్గదర్శనం చేసిం ది. మానవ జీవితాన్ని రసమయం, సుఖమయం చేసినది ప్రశ్నయే! మానవున్ని ఉన్నత శిఖరా లకు అధిరోహింప చేసినదీ ప్రశ్నయే! ఈ ప్రశ్నలనే వేసి యక్షుడు, ధర్మరాజులో ధర్మం ఏపాటి ఉందో తెలుసుకున్నాడు. ప్రశ్నలకు సమాధానం చెప్పక అహంభావంతో వ్యవహరించిన భీమ, అర్జున, నకుల, సహదేవులు చలన రహితులై చతికిలపడ్డారు. భారతంలోని కథే కావచ్చు. కానీ ప్రశ్నను ఎదుర్కోవడంలో వ్యక్తిత్వాలు, న్యాయం, ధర్మం కూడా బయటపడతాయని అర్థ మవుతుంది. యక్షుడు ధర్మరాజు కేసిన 72 ప్రశ్నలలో ఒక ప్రశ్న ఏమిటంటే, మానవుడు మానవత్వమును ఎట్లా పొందుతాడు? అనేది. దానికి ధర్మరాజు సమాధానం, అధ్యయనము వలన అని. అధ్యయనమంటే పరిశీలన, పరిశోధన. ఇవన్నీ ప్రశ్నలతోనే మొదలవుతాయి. కాబట్టి ప్రశ్న జవాబులలోనే ప్రగతి గమనం ఉంటుందనేది జగద్విధితమైన అంశం. మరి ప్రశ్నించడాన్ని అడగటాన్ని నిరోధించాలనుకోవటం ఎంత తిరోగమన విషయం. అడగటం, చెప్పటం, చర్చలతో ఒక సమన్వయాన్ని సాధించటమే ప్రజాస్వామ్యపు నిజమైన రూపమూ సారము. తద్విరుద్ధ ఆచరణ అంతా అప్రజాస్వామికమే. ఇది నియంతల మెదళ్లలో గూడు కట్టుకున్న చీకటి కోణం. అందుకనే నియంతలైన రాజులు ప్రశ్నలను అణచివేస్తూనే వున్నారు. రాముని కాలంలో ప్రశ్నను లేవనెత్తిన శంభూకున్ని గొంతు నులిమేశారు కదా! శాస్త్రవేత్త బ్రూ నోను నిలువునా తగలేసిన సంఘటన చూశాం. భగత్సింగు ప్రశ్నలకు సమాధాన మివ్వలేని బ్రిటీష్‌ పాలకులు ఆయన్ను నిలువునా ఉరితీశారు. ప్రశ్నలడిగినందుకే గౌరీలంకేష్‌ ను అంతమొందించారు. కొత్త చట్టాలు మాకు కష్టాలు తెస్తాయి, తీసెయ్యమని అడిగితే రైతులపై ఎంత నిర్భంధాన్ని ప్రయోగించారు!
మరీ ఇప్పటి పాలకులకు అడగటమంటేనే కంపరమెత్తుకొస్తున్నది. ఎందుకంటే సరైన సమాధానం చెప్పలేని స్థితి ఒకటయితే, రెండోది సమాధానం చెప్పటమే అవమానంగా భావి స్తున్నారు. మొన్నటికి మొన్న ప్రజాస్వామ్య వేదికయిన పార్లమెంటులో ప్రశ్న లేవనెత్తినందుకు మ హువా మొయిత్రాను, కనీసం ఆమె మాట్లాడటానికి అవకాశం కూడా ఇవ్వకుండా బహిష్కరించి బయటికి పంపారు. కానీ అదే సందర్భంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌ మాత్రం దర్జాగా సభలో కూర్చునే ఉన్నారు, అంతకుముందు, అదానీ అక్రమాల, ఆదా యాల గురించి అడుగుతున్నారనే రాహుల్‌గాంధీని బహిష్కరించారు. ఇప్పుడు తాము ఇష్టంగా కట్టించుకున్న పార్లమెంటు కొత్త భవనంలోకి, బీజేపీ ఎంపీ సహకారంతో సభలోకి వచ్చిన వారు పొగబాంబులతో భయాందోళన కలుగజేస్తే వివరణ ఇయ్యమన్నారు అంతే! ఎందుకిలా జరిగిందో బాధ్యులు మాట్లాడాలి అని అడిగారు తోటి పార్ల మెంటు సభ్యులు. ఏం నేరం చేశారు? వారందరినీ దారుణంగా సభనుంచి బహిష్కరించారు. నేరమేమంటే వారిని ప్రశ్నించటమే. ప్రశ్నకు వణికిపోయే బలహీనులు వీళ్లు. అందుకే అడిగే వారినే లేకుండా చేస్తున్నారు. ఇలా ప్రశ్నను, ప్రశ్నించే వారిని హతమార్చిన వారెందరో కాలగర్భంలో కనుమరుగైపోయారు. కానీ ప్రశ్న, అడగటం సజీవంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఉంటాయి కూడా!