
మండలంలోని నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తాసిల్దార్ తోట రవీందర్ ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్, మిగతా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. రెవెన్యూ, భౌగోళిక పరిస్థితులు, ప్రజల సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, కాంగ్రెస్ పార్టీ మండల గౌరవ అధ్యక్షులు జాలపు అనంతరెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ సాంబయ్య, డైరెక్టర్లు యానాల సిద్ది రెడ్డి జగన్ పాలకుర్తి రజిత రవీందర్, యూత్ అధ్యక్షులు కోడి సతీష్, నాయకులు ముజఫర్ హుస్సేన్, చిరంజీవి, బెజ్జూరి శ్రీను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.