ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించిన ఆర్డీఓ

నవతెలంగాణ – డిచ్ పల్లి
నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం, ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసిప్షన్ సెంటర్ లను పరిశీలించేందుకు నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారి రవి గురువారం మండలంలోని ధర్మారం (బి) ఉన్నత పాఠశాల, బార్దిపుర్ గ్రామ పంచాయతీ శివారు లోని సుదిర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు. త్వరలో జరిగే సార్వత్రిక నిర్వహణ కోసం ఎన్నికల సామాగ్రితో పాటు రిసెప్షన్ సెంటర్లను ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించిన నేపథ్యంలో రెండు సెంటర్లను పరిశీలించి ధర్మారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సెలక్ట్ చేసినట్లు ఆర్డీఓ రవి తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాస్ రావు, ఆర్ఎస్ఐ సంతోష్, పాఠశాల హెచ్ఎం ఉషాశ్రీ తదితరులున్నారు.