– లింకన్ ఫార్మాస్యూటికల్స్ వెల్లడి
హైదరాబాద్: వచ్చే 2026 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.750 కోట్ల ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లింకన్ ఫార్మాస్యూటి కల్స్ లిమిటెడ్ తెలిపింది. నికర రుణ రహిత హోదాలను కొనసాగిస్తూనే ఆదాయం, లాభాల్లో మెరుగైన ప్రగతిని కనబర్చాలని నిర్దేశించుకున్నట్లు పేర్కొంది. తొలిసారిగా రూ. 1000 కోట్లకు పైగా మార్కెట్ కేపిటలైజేషన్ సాధించినట్లు వెల్లడించింది. ఆగస్ట్ 25న ఈ కంపెనీ షేరు రూ.479.50 వద్ద ముగిసింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.500 కోట్లకు పైగా రెవెన్యూ, రూ.100 కోట్లకు పైగా పన్నుకు ముందు లాభాలు నమోదు చేసినట్లు పేర్కొంది.