– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తాపట్నాయక్
నవతెలంగాణ-సుబేదారి
స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఓటు హ క్కును వినియోగించుకోవాలని జిల్లా ఎ న్నికల అధికారి, జిల్లాకలెక్టర్ సిక్తాపట్నా యక్ అన్నారు. మంగళవారం స్వీప్ కార్య క్రమంలో భాగంగా ఐడీఓసీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన ఓటుహక్కు న మోదుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వంద శాతం ఓటింగ్ లక్ష్యంగా ఓటింగ్ జరగా లని, ‘ఓట్ ఫర్ స్యూర్’ (నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను) అన్న నినాదంతో స్వీప్ కార్యక్రమం నిర్వహించడం జరుగు తుందన్నారు. ఓటరు జాబితాలోఓటు ఉందా లేదా ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా తెలుసుకోవాలని, ఓటు ఏ పోలిం గ్ కేంద్రం, ఏ ప్రాంతంలోవుందో తెలుసు కోవచ్చన్నారు. మిషన్ 29లో భాగంగా బస్టాండు, రైల్వే స్టేషన్లతో పాటు జనసం చారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ ఆట-పాట, సంస్కృతి కార్యక్రమాలతో, బుర్ర కథలతో, ఫ్లాష్‌మాబ్, 2కేరన్, ఎల క్షన్ కమిషన్ సింబల్స్‌తో కూడుకున్న రంగోలిలతో ఇలా ఎన్నో విధాలుగా ఓట్ హక్కుపై అవగాహన కల్పించాలి అని అ న్నారు. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీ, అ పార్ట్మెంట్లలో నివసించే వారికీ ఓటు హ క్కుపై అవగాహన కల్పించాలన్నారు. సా మాజిక మాధ్యమాల ద్వారా మిమ్స్, కం టెంట్ వీడియో ద్వారా విస్తతంగా ప్రచా రం చేయాలన్నారు. ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధంలాంటిదని దానిని సద్విని యోగం చేసుకొని ప్రజలకు సేవ చేసే నాయకుడిని ఎన్నుకునే విధంగా ప్రజల కు వివరించాలని విద్యార్థు లను కోరారు. వచ్చే దీపావళి పండుగ రోజు సంద్భంగా దీపాలతో ఓటుహక్కు అవగాహన కార్య క్రమం ఏర్పాటు చేయాలని కోరారు. తా ము చేసిన కార్యకలాపాలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేస్తూ మాసోషల్ మీ డియా ఐడిలను వివరిస్తూ ట్యాగ్ చేయా లని కోరారు. ఎన్నికల ఓట్ కు సంబం ధించిన ఏదైనా వివరాలకు ఓటర్స్ హెల్ప్ యాప్‌ని వినియోగించాలని, టోల్‌ఫ్రీ 1950కాల్‌చేసి తెలుసుకోవచ్చు అన్నా రు. సి-విజిల్ యాప్ ను తమ ఫోన్లలలో ప్లే-స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని తమ చుట్టుపక్కల జరుగుతున్న ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను అప్లోడ్ చేయాలని, సం బంధిత అధికారులు వెంటనే పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుం దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. హనుమకొండ జిల్లా ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా విద్యార్ధులతో ప్రతిజ్ఞ చేపించారు. ఈ కార్యక్రమంలో ఇండిస్టియల్ జీఎం హరిప్రసాద్, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధ ర్, ఎన్‌ఎస్‌ఎస్ పిఓలు శ్రీదేవి, శ్రీనివాస్, మాస్టర్జి కళాశాల పి.ఓ సూర్యనారాయ ణ, విద్యార్ధులు పాల్గొన్నారు.
చెక్ పోస్టుల ఆకస్మిక తనిఖీ
నడికుడ : తెలంగాణ రాష్ట్ర వ్యా ప్తంగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లా క లెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ మహేందర్‌జీ మండల కేంద్రంలో ఏర్పా టు చేసిన చెక్‌పోస్టును ఆకస్మికంగా తని ఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లా డుతూ ఎన్నికలనిబంధనల ప్రకారం ప్ర తీ వాహనం తనిఖీ చేయాలని ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని ఎవరైనా అ నుమానాస్పదంగా కనిపించిన ప్రతి ఒక్క రిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు.